Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నటి ట్విషా శర్మ మృతి కేసు: సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

నటి ట్విషా శర్మ మృతి కేసు: సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

వార్త 15 hrs ago

Twisha Sharma: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. విచారణలో ఉన్న లోపాలు, సంస్థాగత పక్షపాతంపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

మే 25న ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Read also: Gold price prediction: ఊహించని స్థాయికి బంగారం, వెండి ధరలు: కియోసాకి

 Twisha Sharma death case investigation

భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్

గత పది రోజులుగా పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జబల్పూర్ కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించిన సమర్థ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఏడు రోజుల పోలీసు కస్టడీని స్థానిక కోర్టు విధించింది. ప్రస్తుతం సమర్థ్ సింగ్‌ను భోపాల్ తరలించి, పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఆయనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వేటు వేసింది.

Twisha Sharma: రెండోసారి పోస్ట్‌మార్టం ప్రక్రియ

ట్విషా శర్మ మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో, రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికోసం ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన వైద్య నిపుణుల బృందం భోపాల్ చేరుకుంది. ఈ కేసులో సాక్ష్యాధారాల సేకరణ, ఫోన్ రికార్డుల పరిశీలన వంటి అంశాలను సుప్రీంకోర్టు పర్యవేక్షించనుంది. నిష్పక్షపాత విచారణ కోసం కుటుంబ సభ్యులు సిబిఐ దర్యాప్తును కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha