Nayanthara Movie: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'హాయ్'. యశ్ సరసన భారీ అంచనాల మధ్య రాబోతున్న 'టాక్సిక్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె, అదే ఆగస్టు నెలలో మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
నయనతార, యంగ్ హీరో కవిన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Read Also : Sai Pallavi : టాలీవుడ్‌కు దూరమైన సాయి పల్లవి..?
Nayanthara’s double treat! Two films releasing in August.
Nayanthara Movie: ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్.. వైరలవుతున్న ప్రోమో!
విష్ణు ఎడవణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని వెల్లడిస్తూ సోమవారం ఒక ప్రత్యేక ప్రోమో వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాను ఆగస్టు 14న థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తూ, “మీ మనసును దోచుకునే కథ ఆగస్టు 14న రాబోతోంది” అని వెల్లడించారు.
విడుదలైన ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. వర్షం పడుతుండగా బస్‌స్టాప్‌లో ఒక చేతిలో సంచి, మరొక చేతిలో వేట కొడవలితో అమాయకమైన లుక్‌లో నయనతార కనిపించింది. అక్కడికి బైక్‌పై వచ్చిన కవిన్, ఆమె చేతిలో ఉన్న వేట కొడవలిని చూసి అవాక్కై 'హాయ్' అని చెప్పడం, అనంతరం ఇద్దరూ కలిసి వర్షంలో బైక్‌పై ప్రయాణించడం ఈ ప్రోమోలో సరదాగా చూపించారు. ఈ చిత్రాన్ని నయనతార సొంత నిర్మాణ సంస్థ ‘రౌడీ పిక్చర్స్’తో కలిసి ‘సెవెన్ స్క్రీన్ స్టూడియోస్’, ‘జీ స్టూడియోస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌కు జెన్ మార్టిన్ సంగీతం అందిస్తున్నారు.
ఆగస్టు నెలలో నయనతార డబుల్ ధమాకా!
నయనతార ఆగస్టు నెలలోనే రెండు వారాల వ్యవధిలో, రెండు వేర్వేరు జానర్ల సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడం విశేషం. ఆగస్టు 26న విడుదల కానున్న ‘టాక్సిక్’ మూవీలో ‘గంగ’ అనే అల్ట్రా మోడర్న్ క్యారెక్టర్‌లో కనిపించనున్న నయనతార, ఆగస్టు 14న రాబోతున్న ‘హాయ్’ చిత్రంలో శారీ కట్టుకుని ఎంతో ఇన్నోసెంట్ లుక్‌తో అలరించబోతున్నారు.

