Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడే పాలిసెట్ ఫలితాలు.. !

నేడే పాలిసెట్ ఫలితాలు.. !

వార్త 3 months ago

Polycet Results 2026 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ (TG POLYCET-2026) ఫలితాలు ఇవాళ (మే 23న) విడుదల కానున్నాయి.

ఉదయం 11:30 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గారు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 98,029 మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి పూర్తి చేసుకుని ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఫలితాల కోసం అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read Also : లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు విడుదల మంత్రి నారా లోకేష

వేగంగా ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ – వే టూ న్యూస్‌లో సులువుగా చెకింగ్

విద్యార్థులు తమ ఫలితాలను మరియు ర్యాంక్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అందరికంటే వేగంగా ‘వే టూ న్యూస్’ (Way2News) యాప్‌లో తనిఖీ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్‌పై కనిపించే ప్రత్యేక విడ్జెట్‌లో అభ్యర్థులు తమ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా క్షణాల్లో ఫలితాలను పొందవచ్చు. ఇక్కడి నుండి విద్యార్థులు తమ ర్యాంక్ కార్డ్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా, తమ స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ ద్వారా ఈజీగా షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ ఫలితాల విడుదల అనంతరం మే 27వ తేదీ నుండి పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. జీవో విడుదల!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha