Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడే RCB, PBKS ఫైట్.. 100వ సారి టాస్‌కు రానున్న శ్రేయస్ అయ్యర్

నేడే RCB, PBKS ఫైట్.. 100వ సారి టాస్‌కు రానున్న శ్రేయస్ అయ్యర్

వార్త 1 week ago

IPL 2026 Today Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

ఈ మ్యాచ్ ద్వారా ఆయన ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. లీగ్‌లో ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ లీగ్ దిగ్గజాల క్లబ్‌లో అడుగుపెడుతున్నారు. గతంలో దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు విజయవంతంగా నాయకత్వం వహించిన అయ్యర్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టును ముందుండి నడిపిస్తున్నారు.

Read Also :KKR vs GT Match Win: గుజరాత్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం!

IPL 2026 Today Match:కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ‘సెంచరీ

ఈ మైలురాయి మ్యాచ్ శ్రేయస్ అయ్యర్‌కు వ్యక్తిగతంగా ఎంతో గర్వకారణమైనప్పటికీ, జట్టు పరంగా మాత్రం పెద్ద సవాలుతో కూడుకున్నది. పంజాబ్ కింగ్స్ లీగ్‌లో వరుసగా ఐదు ఓటములను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే నేటి పోరులో టేబుల్ టాపర్స్ అయిన ఆర్‌సీబీపై పంజాబ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. ఈ హై-ప్రెజర్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ తన వందో కెప్టెన్సీ మ్యాచ్‌ను విజయంతో ముగిస్తారో లేదో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కోల్‌కతాకు మొదటి షాక్ ఇచ్చిన సిరాజ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha