Dailyhunt
నేడే విజయ్ - సంగీత విడాకుల కేసు విచారణ.. విడిపోయేందుకే ఇద్దరూ మొగ్గు?

నేడే విజయ్ - సంగీత విడాకుల కేసు విచారణ.. విడిపోయేందుకే ఇద్దరూ మొగ్గు?

వార్త 1 week ago

Vijay Divorce: తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు కోలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గత కొద్ది రోజులుగా సాగుతున్న విడాకుల ప్రచారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. భార్య సంగీతతో విడిపోయేందుకు విజయ్ సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ నేడు, ఏప్రిల్ 20 (సోమవారం) నాడు విచారణకు రానుంది.

Read Also: Pawan Kalyan Health: తమ్ముడి ఆరోగ్యంపై చిరంజీవి ఎమోషనల్ అప్ డేట్!

భరణంపైనే ప్రధాన చర్చ

విడాకుల వ్యవహారాన్ని కోర్టులో సాగదీయడం ఇష్టం లేక, ఇరువురు కోర్టు వెలుపల (Out-of-court settlement) పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. శనివారం చెన్నైలో జరిగిన లాయర్ల సమావేశంలో భరణం (Alimony) విషయంలో కొన్ని కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా నామినేషన్లో పేర్కొన్న ఆస్తి వివరాల ప్రకారం, తనకు రూ. 250 కోట్లు సెటిల్‌మెంట్‌గా ఇవ్వాలని ఆమె కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

 Sangeetha Vijay Divorce Case Update

Vijay Divorce: భరణంపైనే ప్రధాన చర్చ

అంతేకాకుండా తన ఇద్దరు పిల్లల (కుమారుడు సంజయ్, కుమార్తె దివ్య) భవిష్యత్తు కోసం కూడా ప్రత్యేక సెటిల్‌మెంట్ కావాలని ఆమె డిమాండ్ చేశారట.అయితే విజయ్ మాత్రం సంగీతకు రూ. 35 కోట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని, పిల్లల బాధ్యత మొత్తం తానే చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ‘జన నాయగన్’ సినిమా రెమ్యునరేషన్ కూడా ఇందులో భాగమేనని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే, విడాకుల కేసులో ఏప్రిల్ 20న విజయ్ హాజరవ్వాలని చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారం ఉందని, సోమవారం నాటి విచారణకు ఆన్‌లైన్‌ ద్వారా హాజరుకానున్నట్లు ఈనెల 17న విజయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మిస్ ఇండియా 2026 కిరీటం సాధ్వి సతీష్ సైల్‌కు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha