Dailyhunt
నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ప్రాముఖ్యత గురించి తెలుసా!

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ప్రాముఖ్యత గురించి తెలుసా!

వార్త 1 week ago

International Labour Day 2026: మే 1, 2026 - నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రమజీవుల హక్కులను, వారి పోరాటాలను గౌరవించుకునే రోజూ ఇది.

Read Also:Shock : సామాన్య ప్రజలపై ధరల పిడుగులు

మే డే 2026 థీమ్: "ఆరోగ్యకరమైన సైకోసోషల్ పని వాతావరణం"

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఈ ఏడాది మే డే కోసం "Ensuring a Healthy Psychosocial Working Environment" అనే థీమ్‌ను ఎంచుకుంది. ఆధునిక పని ఒత్తిడిలో కార్మికులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది.పని ప్రదేశాల్లో ఒత్తిడి, బర్న్ అవుట్ (Burnout) వంటి సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలు చూపడం.పని వేళలను క్రమబద్ధీకరించడం ద్వారా వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం.పని ప్రదేశాల్లో వివక్ష, వేధింపులు లేకుండా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం.

International Labour Day 2026: మే డే చరిత్ర: 8 గంటల పని దినం కోసం పోరాటం

1886లో చికాగోలో జరిగిన 'హే మార్కెట్ అఫైర్' మే డే ఆవిర్భావానికి కారణమైంది. రోజుకు కేవలం 8 గంటల పని దినం ఉండాలని కోరుతూ కార్మికులు చేసిన పోరాటమే దీనికి పునాది.భారత్‌లో మొదటి మే డే వేడుకలు 1923లో చెన్నైలో జరిగాయి. 1947 నుంచి దీనిని అధికారికంగా గుర్తించడం ప్రారంభించారు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రోజున సెలవు దినంగా ప్రకటిస్తారు.

భారతదేశంలో మే డే ప్రాముఖ్యత

భారతదేశంలో ఈ రోజును కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిర్వహిస్తాయి.

  1. ర్యాలీలు & ప్రదర్శనలు: మెరుగైన వేతనాలు, పని పరిస్థితుల కోసం కార్మిక సంఘాలు నిరసనలు మరియు సమావేశాలు నిర్వహిస్తాయి.
  2. అసంఘటిత రంగం: గృహ కార్మికులు, వలస కూలీలు, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం అవగాహన కల్పిస్తారు.
  3. సామాజిక భద్రత: చైల్డ్ లేబర్ (బాల కార్మిక వ్యవస్థ) నిర్మూలన, పని ప్రదేశాల్లో భద్రత గురించి ప్రభుత్వాలు చర్చలు చేపడతాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నేటి నుంచి కొత్త రూల్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha