ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు (ఆదివారం) రెండు ఆసక్తికరమైన పోరులు జరగనున్నాయి. ప్లేనేడు మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి.
ప్రస్తుత పాయింట్ల పట్టికలో చెన్నై 5వ స్థానంలో ఉండగా, గుజరాత్ 7వ స్థానంలో ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింటిలో గెలిచి, నాలుగింటిలో ఓటమి పాలయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్-4లోకి దూసుకెళ్లాలని రెండు జట్లు భావిస్తున్నాయి. అయితే, అభిమానులందరి కళ్ళు ఎంఎస్ ధోనీపైనే ఉన్నాయి. గత కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్న ధోనీ, ఈ కీలక పోరులోనైనా బరిలోకి దిగుతారా లేదా అనే దానిపై మేనేజ్‌మెంట్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
Read Also : AI : మెట్రో నగరాలకే కాదు.. విజయవాడకు పాకిన ఏఐ విప్లవం

లక్నోలో ఎల్‌ఎస్‌జీ వర్సెస్ కేకేఆర్
రాత్రి 7:30 గంటలకు లక్నోలోని ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య పోరు జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున (9, 10 స్థానాల్లో) ఉన్నాయి. లక్నో 4 పాయింట్లతో ఉండగా, కేకేఆర్ కేవలం 3 పాయింట్లతో ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలోపేతం కానుంది. శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరణ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న అతను జట్టులోకి వస్తే కోల్‌కతా డెత్ ఓవర్ల సమస్య తీరే అవకాశం ఉంది.
ఎవరికి దక్కేను విజయం?
టోర్నీ సగం దశకు చేరుకున్న తరుణంలో నేటి మ్యాచులు చాలా కీలకం. ముఖ్యంగా సీఎస్‌కే తన హోమ్ గ్రౌండ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, గుజరాత్ బౌలింగ్ లైనప్‌ను తక్కువ అంచనా వేయలేం. మరోవైపు, లక్నోలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో లక్నో స్పిన్నర్లు రవి బిష్ణోయ్ వంటి వారు కేకేఆర్ బ్యాటర్లను ఎలా అడ్డుకుంటారో చూడాలి. వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్, లక్నో జట్లకు ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్యగా మారింది. పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపరుచుకోవాలంటే నేడు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

