AP Telangana Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. శుక్రవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్ష నమోదు కాగా, రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడుతోంది. ఇది శనివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ రాగల కొన్ని రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
Read Also : Konaseema schools: కోనసీమలో బడులకు సెలవులు పొడిగింపు!
Moderate to extremely heavy rains in AP and Telangana today
AP Telangana Rains Alert: ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్షాల అలర్ట్
వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్ష తీవ్రత పెరగనుంది. ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు వర్ష సూచన ఉన్న జిల్లాలు అన్నమయ్య, కృష్ణా, విజయనగరం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున రేపటి నుంచి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'
ఇటు తెలంగాణలోనూ వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేయడమైంది. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు.
ప్రభావితమయ్యే జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని సూచించారు.

