IDBI Bank strike:ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు దేశవ్యాప్తంగా నవంబర్ 2, 3 తేదీల్లో సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున బ్యాంకు శాఖల్లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగనుంది.
Binance Hack: బినాన్స్‌పై భారీ సైబర్ దాడి.. రూ.52 వేల కోట్ల క్రిప్టో ఆస్తులపై హ్యాకర్ల కన్ను!
Warning for IDBI Bank account holders
IDBI Bank strike:ఖాతాదారులకు బ్యాంకు కీలక సూచనలు
బ్రాంచ్ సేవలు నిలిచిపోయినప్పటికీ, ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఐడీబీఐ బ్యాంకు కొన్ని ప్రత్యామ్నాయ సేవలను అందుబాటులో ఉంచింది.
- ఉచిత నగదు ఉపసంహరణ: ఖాతాదారులు ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంల ద్వారా ఎలాంటి పరిమితులు లేదా అదనపు రుసుములు లేకుండా ఉచితంగా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది.
- డిజిటల్ సేవలు యథావిధిగా: గో మొబైల్ ప్లస్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే యూపీఐ (UPI) సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా సాధారణంగానే పనిచేస్తాయని స్పష్టం చేసింది.
Epaper: epaper.vaartha.com
ఇరాన్-అమెరికాల మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు..తగ్గిన చమురు ధరలు

