8th Pay Commission: నేడు, ఏప్రిల్ 13, 2026న నేషనల్ కౌన్సిల్ (JCM) డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు మరియు అలవెన్సుల పెంపునకు సంబంధించిన తుది మెమోరాండంను సిద్ధం చేయనున్నారు.
ప్రస్తుతం పెరుగుతున్న ధరలను (ద్రవ్యోల్బణం) పరిగణనలోకి తీసుకుని, కరువు భత్యాన్ని (DA) ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. డీఏ విలీనం జరిగితే బేసిక్ శాలరీతో పాటు ఇతర అలవెన్సులు కూడా పెరిగి, ఉద్యోగుల చేతికి వచ్చే వేతనం గణనీయంగా పెరుగుతుంది.
Read Also :CBI FIR: లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Decision on the 8th Pay Commission’s final memorandum today-pensions set to increase.
8th Pay Commission: పెరగనున్న డీఏ.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పైనే అందరి కళ్లు!
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58 శాతం డీఏ పొందుతుండగా, ఇది మరో 2 శాతం పెరిగి 60 శాతానికి చేరే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఈ పెంపు అమలైతే, జనవరి 1, 2026 నుండి అరియర్స్ (బకాయిలు) కూడా లభిస్తాయి. మరోవైపు, కొత్త పే కమిషన్‌లో జీతాల పెంపును నిర్ణయించే ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ కనీసం 3.25 ఉండాలని యూనియన్లు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే లక్షలాది మంది ఉద్యోగుల మరియు రిటైర్డ్ సిబ్బంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
జేసీఎం సమావేశం – ప్రధాన అజెండా
శివగోపాల్ మిశ్రా (సెక్రటరీ, NC-JCM) నేతృత్వంలో జరిగే నేటి భేటీలో.. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, కొత్త వేతన స్కేలు మరియు గతంలో పే కమిషన్ అడిగిన ప్రశ్నావళికి సమాధానాలను ఖరారు చేయనున్నారు. ఈ చర్చల అనంతరం వెలువడే నివేదిక ఆధారంగానే 8వ పే కమిషన్ తన తుది సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ పరిణామం కోట్లాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
సమ్మర్ స్పెషల్ రైళ్ల జాబితా విడుదల.. టికెట్ల బుకింగ్ ప్రారంభం

