Khairatabad Ganesh Nimajjanam: హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రాచుర్యం పొందిన 69 అడుగుల ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జన వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను ఘనంగా పూర్తి చేసింది.
గురువారం రాత్రి ప్రత్యేకంగా కలశపూజ నిర్వహించిన అనంతరం, శుక్రవారం ఉదయం సరిగ్గా 6 గంటలకు మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభం కానుంది. భక్తుల జైఘోషల నడుమ ఈ చారిత్రక శోభాయాత్ర సాగనుంది.

మధ్యాహ్నం 12 గంటలలోపే నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు
భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. శోభాయాత్రను సజావుగా ముగించి, మధ్యాహ్నం 12 గంటలలోపే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ విగ్రహాన్ని సురక్షితంగా తరలించేందుకు మరియు నీటిలో నిమజ్జనం చేయడానికి ప్రత్యేకంగా ‘లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్’ను అందుబాటులో ఉంచారు.

