Shiv Pratap Shukla: గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' (డ్రగ్స్ రహిత భారత్) అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.

పసుపు రైతులతో గవర్నర్ ముఖాముఖి చర్చలు
ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా నగరంలోని పసుపు బోర్డు కార్యవిధాన్ని సందర్శించనున్నారు. అక్కడ స్థానిక పసుపు రైతులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి, వారి పంట సాగు విధానాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు ఇతర వ్యవసాయ సమస్యల గురించి ఆరా తీయనున్నారు.

