Praja palana Day: 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, తెలంగాణ వ్యాప్తంగా గురువారం అధికారికంగా మరియు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు ప్రారంభమయ్యాయి.
సరిగ్గా ఈ రోజే నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన నేపథ్యంలో రాష్ట్రంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేర్వేరు పేర్లతో వేడుకలు
ఈ చారిత్రక దినాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దీనిని 'తెలంగాణ విమోచన దినోత్సవం'గా జరుపుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిని 'ప్రజాపాలన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహిస్తోంది.
Praja palana Day: పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి జాతీయ జెండా ఆవిష్కరణ
'ప్రజాపాలన దినోత్సవం'లో భాగంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరై అమరులకు నివాళులు అర్పించనున్నారు.
తెలంగాణ లో కొత్త పెన్షన్లు కోసం ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

