Yennam Srinivas Reddy: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
ఈ మేరకు ఆయనకు బుధవారం నాడు సిట్ ఎసిపి వెంకటగిరి నోటీసులు జా రీ చేయడం తెలిసిందే. గతంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుల్లో శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక రు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్కు గురయ్యిందని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు అనేకమార్లు ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసు విచారణలో శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు తేలింది.
Read Also : Husnabad Municipal Politics: హుస్నాబాద్ లో ఏబీసీడీ రాజకీయం..కౌన్సిలర్లు సైడ్‌లైనేనా..?
Government whip to be appointed for SIT inquiry today
Yennam Srinivas Reddy:రెండోసారి సిట్ నోటీసులు జారీ
దీనిపై సిట్ అధికారులు గత ఏడాది జూలై ఏడవ తేదీన శ్రీనివాస్ రెడ్డికి మొదటిసారి నోటీసులు ఇవ్వగా అనివార్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. దీంతో తాజాగా ఆయ నకు మరోసారి నోటీసులు ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల ఫోన్లను అప్పట్లో ట్యాపింగ్ చేశారని ఈ కేసును విచారిస్తున్న సిట్ తేల్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువరు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సిట్ తాజాగా శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కమాండ్ కంట్రోల్లోని 18వ అంతస్తులో గల సిట్ కార్యా లయంలో శ్రీనివాస్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

