Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు

నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు

వార్త 3 weeks ago

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ బారిన పడిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..

తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, చక్కెర, బంగాళాదుంపలు, ఒక లీటర్ పామాయిల్‌తో పాటు రూ. 1000 ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

విద్యుత్ పునరుద్ధరణ మరియు పంట నష్టం అంచనా

తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న కొన్ని జిల్లాలలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని సీఎం తెలిపారు. క్షేత్రస్థాయిలో తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పవర్ సప్లైను పూర్తిగా పునరుద్ధరించడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన వివరించారు. మరోవైపు, వర్షాలు మరియు ఈదురు గాలుల కారణంగా రైతులు నష్టపోయిన పంటల వివరాలను సేకరించే ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని వెల్లడించారు. బాధితులకు పూర్తి అండగా ఉండేందుకు తాను స్వయంగా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

కోనసీమ 'కన్నీరు'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha