Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEET UG 2026 రిజల్ట్స్ & స్కోర్‌కార్డ్ విడుదల తేదీపై క్లారిటీ!

NEET UG 2026 రిజల్ట్స్ & స్కోర్‌కార్డ్ విడుదల తేదీపై క్లారిటీ!

వార్త 1 week ago

NEET 2026 Result Date: జూన్ 21న జరిగిన NEET UG రీ-ఎగ్జామ్ ముగియడంతో, అభ్యర్థులు NEET 2026 ఫలితాలు కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించనప్పటికీ, ఫలితాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా, అధికారిక సమాచారం కోసం వేచి ఉండటం ఉత్తమం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా, NTA వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో అవ్వండి.

Read also: TS 10th Supply Results 2026: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి.. డైరెక్ట్ లింక్ ఇదే!

 NEET 2026 Results Update

పరీక్ష ఫలితాల అంచనా కాలక్రమం

రీ-ఎగ్జామ్ తర్వాత, ఫలితాలు విడుదలయ్యే ముందు కొన్ని ముఖ్యమైన దశలు ఉంటాయి. ముందుగా తాత్కాలిక ఆన్సర్ కీ అందుబాటులోకి వస్తుంది, ఆపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది. దీని తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని NTA విడుదల చేస్తుంది. జూన్ చివరి నాటికి ఆన్సర్ కీ వచ్చే అవకాశం ఉంది. జూలై మధ్య నాటికి తుది ఆన్సర్ కీ మరియు జూలై నెలాఖరు వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.

NEET 2026 Result Date: స్కోర్‌కార్డ్‌లో ఉండే ముఖ్యమైన సమాచారం

మీ స్కోర్‌కార్డ్ విడుదలైన తర్వాత అందులో కొన్ని కీలక వివరాలు ఉంటాయి. అభ్యర్థి పేరు, రోల్ నంబర్ మరియు సబ్జెక్టుల వారీగా మార్కులు ఉంటాయి. అలాగే మొత్తం మార్కులు, పర్సంటైల్ స్కోర్ మరియు ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) పొందుపరుస్తారు. వీటన్నిటితో పాటు కేటగిరీ ర్యాంక్ మరియు మీ అర్హత స్థితిని కూడా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసిన వెంటనే ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముసరం.

ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునే విధానం

  • అధికారిక NTA NEET వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో కనిపించే NEET UG 2026 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
  • లాగిన్ అయిన తర్వాత స్కోర్‌కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

పరీక్ష తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ

ఫలితాలు వెలువడిన వెంటనే ప్రవేశాల ప్రక్రియ కౌన్సెలింగ్ దశకు చేరుకుంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులు 15% ఆల్ ఇండియా కోటా మరియు 85% స్టేట్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్‌మెర్ మరియు ఇతర వైద్య కళాశాలల్లో సీట్ల కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ ఫలితాల తర్వాత విడుదలవుతుంది.

Epaper: epaper.vaartha.com

గుడ్ న్యూస్! తెలంగాణలో 24 డీఈవో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha