Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల రోజుల బాలింతలైన వదిన, మరదలు వరుస మృతి!

నెల రోజుల బాలింతలైన వదిన, మరదలు వరుస మృతి!

వార్త 1 day ago

Postpartum Mother Deaths Medak: మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఒకే ఇంట్లో రెండు విషాదాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నెల రోజుల క్రితమే పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన వదిన, మరదలు వరుసగా మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర గుండెకోత మిగిలింది.

Read Also:Masab Tank Lawyer Murder:లాయర్ ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో తొక్కించి హత్య!

తల్లిగారింట్లోనే అనారోగ్యంతో వదిన మృతి

 Chegunta Mandal Reddypally

రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్షన్న రమేష్ భార్య స్వాతి (26) సుమారు నెల రోజుల క్రితం ప్రసవించింది. కాన్పు అనంతరం ఆమె చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని తన పుట్టింట్లో (తల్లిగారింట్లో) ఉంటోంది. అయితే, శుక్రవారం రాత్రి స్వాతి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూసింది. పండంటి బిడ్డను చేతికి అందించిన తల్లి, నెల తిరక్కుండానే అనంతలోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది.

వదిన మృతదేహాన్ని చూస్తూనే మరదలు అస్వస్థత.. అంతలోనే మరణం!

పుట్టింట్లో చనిపోయిన స్వాతి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం శనివారం ఉదయం చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఆమె అత్తగారింటికి తీసుకువచ్చారు. స్వాతికి వరుసకు మరదలైన సౌందర్య (27) కూడా నెల రోజుల క్రితమే కుమారుడికి జన్మనిచ్చింది. బాలింత అయిన సౌందర్య.. తన వదిన స్వాతి మృతదేహాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక ఆందోళనకు గురైంది. ఆ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించే లోపే సౌందర్య కూడా ప్రాణాలు విడిచింది.

Postpartum Mother Deaths Medak: అనాథలుగా మారిన పసికందులు

నెల రోజుల వ్యవధిలో ఇద్దరు యువ బాలింతలు, అదీ ఒకే కుటుంబంలో వదిన-మరదళ్లు మృతి చెందడంతో రెడ్డిపల్లి గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. సౌందర్యకు నెల లోపు వయసున్న కుమారుడు ఉన్నాడు. అటు స్వాతి బిడ్డ, ఇటు సౌందర్య కుమారుడు.. ఇద్దరు పసికందులు పుట్టిన నెల రోజులకే తల్లి పాలు కూడా సరిగ్గా తాగకుండానే అనాథలుగా మారిపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. ఒకేసారి ఇద్దరు బాలింతల మరణంతో ఆయా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha