Dailyhunt
నెల్లూరు పండ్ల వ్యాపారులకు జేసీ వార్నింగ్!

నెల్లూరు పండ్ల వ్యాపారులకు జేసీ వార్నింగ్!

వార్త 1 week ago

Nellore JC News: ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా నిషేధిత రసాయనాలతో పండ్లను కృత్రిమంగా పండించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

బుధవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని శంకరన్ సమావేశ మందిరంలో నగరంలోని పండ్ల వ్యాపారులు, సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు.

Read Also: AP VOA Incentive Arrears Release 2026: వీవోఏలకు పండగ లాంటి వార్త: రూ. 22.67 కోట్ల బకాయిల విడుదల

తొలుత అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మామిడి, అరటి పండ్లను ఏ విధంగా కృత్రిమ పద్ధతుల్లో మగ్గబెట్టాలి, ఎలాంటి పద్ధతుల్లో మగ్గబెట్టకూడదో వివరించారు. జిల్లాలో కార్పయిడ్ ను వ్యాపారులు ఎవరు కూడా వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. పండ్ల కృత్రిమ మగ్గింపునకు ఎతిలిన్ గ్యాస్ ఛాంబర్లు, ఎథిలిన్ సాచేట్లను ప్రభుత్వం నిబంధనలు మేరకు వినియోగించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్షతోపాటు 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Nellore JC News: ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాల వినియోగం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, ఇటువంటి చర్యలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. పండ్లను సహజంగా లేదా నియంత్రిత ఎథిలిన్ గ్యాస్ పద్ధతిలో మాత్రమే పండించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పండ్ల వ్యాపారులు నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించి వినియోగదారులకు సురక్షితమైన పండ్లు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. గోదాములు, నిల్వ కేంద్రాల్లో శుభ్రత, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి అక్రమ చర్యలను అరికట్టాలని ఆదేశించారు.
ప్రజలు అసహజంగా మెరుస్తున్న లేదా త్వరగా పండినట్లు కనిపించే పండ్లపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులను వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారం - ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పండ్ల కృత్రిమ మగ్గింపు పై పండ్ల వ్యాపారులకు ఉద్యానవన శాస్త్రవేత్తలతో ఒక అవగాహన సదస్సు నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, తూనికల కొలతల శాఖ అధికారి ఐజాక్, మార్కెటింగ్ శాఖ ఏడి అనిత, ఫుడ్ సేఫ్టీ అధికారులు, పండ్ల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కోటమిట్టలో కార్డెన్ సెర్చ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha