Trump insults Netanyahu ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలను ప్రమాదంలో పడేసేలా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ సంభాషణలో నెతన్యాహును 'పిచ్చోడిలా', 'కృతజ్ఞత లేని వాడిగా' ట్రంప్ (Trump) అభివర్ణించారు.
గతంలో నెతన్యాహుపై ఉన్న అవినీతి కేసుల ప్రస్తావన తెస్తూ.. “నీకు పిచ్చి పట్టింది. నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నిన్ను నేనే కాపాడాను. కానీ ఇప్పుడు నీ చర్యల వల్ల ప్రపంచమంతా నిన్ను, ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తోంది” అంటూ ట్రంప్ తీవ్ర అక్షింతలు వేశారు.
Read Also: Oil : భారత్ కు గుడ్ న్యూస్ ..తీరనున్న చమురు కష్టాలు
Trump insults Netanyahu
బీరుట్ దాడుల ప్రణాళికకు బ్రేకులు
లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబు దాడులు చేయాలన్న ఇజ్రాయెల్ సైనిక ప్రణాళికను ట్రంప్ పూర్తిగా వ్యతిరేకించారు. ఒకే ఒక్క హిజ్బుల్లా కమాండర్‌ను హతమార్చడం కోసం పెద్ద పెద్ద భవనాలను కూల్చివేయడం, అమాయక లెబనీస్ పౌరుల ప్రాణాలను బలిగొనడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ రకమైన బెదిరింపులు మరియు దాడులు ప్రపంచ దేశాల ముందు ఇజ్రాయెల్‌ను మరింత ఏకాకిని చేస్తాయని ట్రంప్ హెచ్చరించారు. దీంతో బీరుట్‌పై దాడి చేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి.
Trump insults Netanyahu: వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్
ట్రంప్ చేసిన తీవ్ర హెచ్చరికల అనంతరం ఇజ్రాయెల్ తన పంథాను మార్చుకుంది. బీరుట్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ప్రస్తుతానికి దాడులు చేసే ప్రణాళిక ఏదీ లేదని ఇజ్రాయెల్ ఉన్నతాధికారి ఒకరు అధికారికంగా వెల్లడించారు. అటు ట్రంప్ కూడా నెతన్యాహుతో జరిపిన సంభాషణ ఫలప్రదమైందని, ఇజ్రాయెల్ దళాలు బీరుట్ వైపు వెళ్లడం లేదని ధృవీకరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

