ఇరాన్‌తో అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పోప్ లియో XIV చేసిన విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమన్నారు. ఒకవేళ తాను అమెరికా ప్రెసిడెంట్ అయి ఉండకుంటే, లియో XIVకు పోప్ అయ్యే అవకాశమే లభించి ఉండేది కాదని ఆయన మండిపడ్డారు.
పోప్ హోదాలో ఉన్న లియో XIV నేరాల విభాగంలో బలహీనంగా ఉన్నారని, అమెరికా విదేశాంగ విధానం విషయంలో దారుణంగా మాట్లాడుతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అనంతరం ఒక ఏఐ జనరేటెడ్ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ట్రంప్, వదులుగా ఉన్న వస్త్రాలు ధరించి, లాజరును యేసు స్వస్థపరిచిన బైబిల్ కథను పోలిన రీతిలో ఒక రోగిపై తన చేతిని ఉంచినట్లు చూపించారు. ఈ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో అమెరికా జెండా, దేవదూతల రూపాలు, సైనిక విమానాలు ఉన్నాయి.
Read Also: US Iran peace talks : నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
Trump vs Leo XIV
Trump vs Leo XIV: పోప్ కంటే ఆయన సోదరుడే నాకు ఎక్కువ ఇష్టం
“ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంపై పోప్ లియో XIV మెతక వైఖరిని అవలంభిస్తున్నారు. కానీ అమెరికా సైనిక చర్యలను వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ప్రజలు నాకు చారిత్రక విజయాన్ని అందించారు. మా ప్రభుత్వం సరైన నిర్ణయాలే తీసుకుంటోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మేం బలంగా పనిచేస్తున్నాం. దేశ ప్రయోజనాలకు దోహదపడే విదేశాంగ విధానాన్నే అవలంభిస్తున్నాం. పోప్ నా ప్రభుత్వం వల్ల కలుగుతున్న భయం గురించి మాట్లాడుతున్నారు. కానీ కొవిడ్ 19 సంక్షోభ కాలంలో క్యాథలిక్ చర్చ్, అన్ని క్రైస్తవ సంస్థలు ఎదుర్కొన్న భయం గురించి పోప్ మాట్లాడటం లేదు. ఆ సమయంలో చర్చి కార్యక్రమాలను నిర్వహించినందుకు క్రైస్తవ మత ప్రబోధకులు, మత ప్రచారకులను అరెస్టు చేశారు. వాళ్లు ఇళ్ల బయటకు వెళ్లి, ప్రజలకు 10 నుంచి 20 అడుగుల దూరంలో ఉన్నా ఆనాడు అరెస్టులు జరిగాయి. పోప్ లియో XIV కంటే ఆయన సోదరుడు లూయీస్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే లూయీస్ పూర్తిగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) వైఖరిని కలిగి ఉంటారు. లూయీస్‌లో ఇది ఉంది. లియో XIVలో లేదు” అని తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

