Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ వరదలు.. 1643 మంది స్టూడెంట్స్ ని కాపాడిన ప్రిన్సిపల్..!

నేపాల్ వరదలు.. 1643 మంది స్టూడెంట్స్ ని కాపాడిన ప్రిన్సిపల్..!

వార్త 3 weeks ago

Nepa Floods : నేపాల్‌లోని త్రిశూలి లోయను వణికించిన ఆకస్మిక వరదల్లో ఓ స్కూల్ ప్రిన్సిపల్ చూపిన సమయస్ఫూర్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా (Nepa Floods) ప్రశంసలు అందుకుంటోంది.

త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడి తన వేగవంతమైన నిర్ణయంతో ఏకంగా 1,643 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి ప్రాణాలను కాపాడారు.

హెచ్చరికతో పరిస్థితి తీవ్రతను :

ఆగస్టు 26 ఉదయం సుమారు 9.20 గంటలకు దవాడికి ఓ స్నేహితుడి నుంచి అత్యవసర సమాచారం వచ్చింది. "గ్రామం మొత్తం నదిలో కొట్టుకుపోయింది.. వెంటనే పరుగెత్తండి" అంటూ వచ్చిన హెచ్చరికతో పరిస్థితి తీవ్రతను ఆయన అర్థం చేసుకున్నారు. వెంటనే స్కూల్ బెల్ మోగించి, తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను బయటకు పంపించారు. అప్పటికే సుమారు 900 మంది విద్యార్థులు స్కూల్లో ఉండగా, మరో 700 మందికి పైగా విద్యార్థులు బస్సులు, కాలినడకన స్కూల్‌కు వస్తున్నారు.

బస్సు డ్రైవర్లకు ఫోన్ చేసి వాహనాలను వెనక్కి తిప్పాలని ఆదేశించారు. ఒక బస్సును మాత్రం సంప్రదించలేకపోయారు. అది వంతెనపైకి చేరేసరికి వరద ఉధృతి పెరిగింది. డ్రైవర్ చివరి క్షణంలో బస్సును వెనక్కి తిప్పగా, కొద్దిసేపటికే ఆ వంతెన వరదలో కూలిపోయింది. అనంతరం విద్యార్థులను కొండపైకి తరలించి సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించారు.

విద్యార్థులందరూ బయటపడిన కొద్దిసేపటికే మూడు అంతస్తుల స్కూల్ భవనం వరదలో పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ విపత్తులో పలువురు మృతి చెందగా, వేలాది మంది గల్లంతయ్యారు. తాజా నివేదికల ప్రకారం నేపాల్‌లోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. "నేను చేయాల్సింది అదే చేశాను" అంటూ దవాడి తనను తాను హీరోగా భావించకపోయినా, 1,643 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన ఆయన నిర్ణయం నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది.

అతిపెద్ద, చిన్న రైల్వే స్టేషన్లు పేర్లు ఏంటో తెలుసా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha