Nepal Currency Rules: సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లే భారతీయ పర్యాటకులకు, అలాగే వ్యాపార, ఉద్యోగ నిమిత్తం భారత్‌కు వచ్చి వెళ్లే నేపాల్ పౌరులకు ఆ దేశ కేంద్ర బ్యాంక్ నేపాల్ రాష్ట్రా బ్యాంక్ (NRB) భారీ ఊరటనిచ్చింది.
ఇరుదేశాల మధ్య నిత్యం సాగే ప్రయాణాలు, సరిహద్దు వ్యాపార లావాదేవీలను మరింత సులభతరం చేసేలా ఇండియన్ కరెన్సీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. భారత్, నేపాల్ పౌరులు ఎవరైనా సరే తమ వెంట గరిష్టంగా 25,000 రూపాయల వరకు భారత కరెన్సీని నేపాల్‌లోకి తీసుకెళ్లడానికి లేదా అక్కడ నుంచి భారత్‌కు తీసుకురావడానికి అనుమతి లభించింది.
Read Also:Post Office Scheme: నెలకు రూ.9250 ఇచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీమ్
కొత్త నిబంధనలు & షరతులు

- రూ. 200, రూ. 500 నోట్లకు సడలింపు:
- 2016 నవంబర్ 9 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన రూ. 200 మరియు రూ. 500 నోట్లకు మాత్రమే ఈ 25,000 రూపాయల సడలింపు వర్తిస్తుంది. ఇకపై సరిహద్దు తనిఖీల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.
- పాత పెద్ద నోట్లపై నిషేధం యథాతథం:
- 2016 డీమోనిటైజేషన్ సమయంలో రద్దయిన పాత రూ. 500, రూ. 1000 నోట్లను నేపాల్‌లోకి తీసుకురావడంపై ఉన్న నిషేధం యథాతథంగా కొనసాగుతుందని ఎన్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. పాత నోట్లను తెస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
- మూడో దేశానికి భారత కరెన్సీ తీసుకెళ్లడం నిషిద్ధం:
- నేపాల్ వాసులు కేవలం భారతదేశం నుంచి మాత్రమే ఈ ఇండియన్ కరెన్సీని తమ దేశానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా, నేపాల్ నుంచి ఇతర మూడో దేశానికి (Third Country) వెళ్లేటప్పుడు ఈ భారతీయ రూపాయిలను వెంట తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
- విదేశీ కరెన్సీ / డాలర్ పరిమితి:
- భారత్ మినహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 5,000 అమెరికన్ డాలర్ల (లేదా దానికి సమానమైన ఇతర విదేశీ కరెన్సీ) వరకు ఎలాంటి కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా నేపాల్‌లోకి తెచ్చుకోవచ్చు. ఆ పరిమితి దాటితే కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందించాల్సి ఉంటుంది.
Nepal Currency Rules: పర్యాటకరంగం, సరిహద్దు వ్యాపారానికి బూస్ట్
ఈ నిర్ణయం వల్ల భారత్ నుంచి నేపాల్ వెళ్లే వేలాది మంది టూరిస్టులకు, విద్యా, ఉద్యోగ నిమిత్తం భారత్‌లో ఉండే నేపాల్ వాసులకు ఎంతో మేలు జరుగుతుందని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అధికార ప్రతినిధి గురు ప్రసాద్ పౌడేల్ తెలిపారు. ఓపెన్ బోర్డర్ కలిగిన ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు ఈ నిర్ణయంతో మరింత బలపడతాయని విశ్లేషిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

