Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నేపాల్‌ విపత్తు నేర్పిన పాఠాలు, భారత్‌కు పొంచి ఉన్న ముప్పు!

వార్త 3 weeks ago

China Dam Effect On India : నేపాల్‌ సరిహద్దుల్లో సంభవించిన భయానక జలప్రళయం హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను, సరిహద్దు దేశాలకు ఎదురయ్యే ముప్పును మరోసారి ఎత్తిచూపింది.

టిబెట్‌లో మంచు-రాళ్లు విరిగిపడటంతో ఒక్కసారిగా వచ్చిన వరద నేపాల్ నదీ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. అయితే టిబెట్ వైపు నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేదా సమాచారం అందకపోవడమే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణమని నేపాల్ వాదిస్తోంది. ఈ ఘటనే ఇప్పుడు భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Read Also: Maharashtra Tourists Stuck In Flood : నేపాల్‌లో చిక్కుకున్న 80 మంది మహారాష్ట్ర పర్యాటకులు

 China Dam Effect On India

చైనా మెగా ప్రాజెక్టు & పొంచి ఉన్న భౌగోళిక ప్రమాదాలు

టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో (భారత్‌లో బ్రహ్మపుత్ర) నదిపై చైనా 167 బిలియన్ డాలర్ల భారీ వ్యయంతో 60 వేల మెగావాట్ల సామర్థ్యం గల డ్యామ్‌ను నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద త్రీగోర్జెస్ డ్యామ్ కంటే భారీది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం 'పైజెన్ ఫాల్ట్' అనే భూగర్భ పగులుపై ఉంది. హిమాలయాలు ఇప్పటికే భూకంప తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ ఏ చిన్న భూకంపం వచ్చినా ప్రమాద తీవ్రత ఊహించలేము. పొడి కాలంలో నీటిని ఆపడం లేదా భారీ వర్షాల సమయంలో ఒక్కసారిగా రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉంది. భారత్-చైనా మధ్య సమగ్ర నదీజల ఒప్పందం లేదా రియల్-టైమ్ సమాచార మార్పిడి వ్యవస్థ లేకపోవడం అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర నష్టానికి దారితీసే అవకాశం ఉంది. చైనా ప్రాజెక్టును ఎదుర్కొనేందుకు మరియు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో 11 వేల మెగావాట్ల 'సియాంగ్ అప్పర్ మల్టీపర్సస్ ప్రాజెక్టు'ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. చైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్‌ కూడా తనవంతు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్‌ అప్పర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టును నిర్మించేందుకు భారత్‌ ముందుకు సాగుతోంది.

నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారు: విదేశాంగ మంత్రి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha