Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్‌కు సోనూసూద్‌ సాయం.. పబ్లిసిటీ అంటూ ట్రోల్స్: సోనూ సూద్ హుందైన రిప్లై

నేపాల్‌కు సోనూసూద్‌ సాయం.. పబ్లిసిటీ అంటూ ట్రోల్స్: సోనూ సూద్ హుందైన రిప్లై

వార్త 2 weeks ago

Sonu Sood: వరదలతో తీవ్రంగా అల్లాడుతున్న నేపాల్ కు ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ అండగా నిలిచారు. తన బృందంతో కలిసి నేరుగా రాజధాని ఖాట్మండుకు చేరుకున్న ఆయన, అక్కడ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.

వరద బాధితులకు అవసరమైన ఆహారం, దుప్పట్లు, నిత్యావసర వస్తువులను స్వయంగా అందజేస్తూ బాధితులకు భరోసానిచ్చారు.

 When Sonu Sood faced criticism-labeling the aid he provided to Nepal a ‘publicity stunt’-he responded with dignity.

Sonu Sood: ‘నేపాల్ నువ్వు ఒంటరివి కావు’

సహాయక చర్యలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సోనూ సూద్, “మనమంతా కలిసి వారికి ఓ కొత్త జీవితాన్ని అందిద్దాం.. నేపాల్, నువ్వు ఒంటరివి కావు” అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా, ఎంతోమంది ఆయన మానవత్వాన్ని కొనియాడారు.

పబ్లిసిటీ అంటూ ట్రోల్స్.. సోనూ సూద్ హుందైన రిప్లై

అయితే, ఈ సహాయక కార్యక్రమాలపై కొందరు విమర్శలు గుప్పించారు. కేవలం సెల్ఫ్ మార్కెటింగ్, ప్రచారం కోసమే సోనూ సూద్ ఇలా చేస్తున్నారంటూ ఒక జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా పోస్ట్ చేశారు. పనులు సరిగ్గా ప్రారంభించక ముందే ఆయనను దేవుడిగా చిత్రీకరించే మార్కెటింగ్ మొదలైందని ఆరోపించారు.

ఈ విమర్శలపై సోనూ సూద్ ఎంతో శాంతంగా, హుందాగా స్పందించారు. “సోదరా.. మీరు చాలా మంచివారు. నేపాల్‌కు రండి, మనమిద్దరం కలిసి అక్కడి ప్రజలకు సహాయం చేద్దాం” అని అతనికి ఆహ్వానం పలికారు. తనపై నెగెటివిటీని ప్రచారం చేసిన వారికి కూడా ఎంతో సానుకూలంగా సమాధానమివ్వడంతో నెటిజన్లు సోనూ సూద్ గొప్ప మనసును మరోసారి ప్రశంసిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ, ఆయన తన సేవా కార్యక్రమాలను ఏమాత్రం ఆపకుండా ముందుకు సాగుతుండటం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha