Nepal Floods: నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 1,222కి చేరుకుంది.
వరదలు వచ్చి వారం రోజులు గడుస్తున్నప్పటికీ, ఇంకా సుమారు 4,000 మంది ఆచూకీ లభించలేదని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారిలో ఏకంగా 583 మంది విదేశీ జాతీయులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లు.. ఎదురవుతున్న అడ్డంకులు
విపత్తు ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు సుమారు 12,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని రక్షించేందుకు మరియు సహాయక చర్యలు చేపట్టేందుకు 20,000 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, వరదల కారణంగా రోడ్లపై భారీగా బురద పేరుకుపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక మరియు రెస్క్యూ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Nepal Floods: టిబెట్‌లోనూ భారీ నష్టం
కేవలం నేపాల్‌లోనే కాకుండా పొరుగు ప్రాంతమైన టిబెట్‌లోని గిరాంగ్ కౌంటీలో కూడా వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ మృతుల సంఖ్య 21కి పెరగగా, మరో 541 మంది గల్లంతైనట్లు సమాచారం. హిమాలయ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్గాల వల్ల ఇరు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Epaper: epaper.vaartha.com

