ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.
నేరగాళ్లు, మాఫియా శక్తుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న 'జీరో టాలరెన్స్' (Zero Tolerance Policy) విధానం క్షేత్రస్థాయిలో గట్టి ఫలితాలను ఇస్తోందని యూపీ హోంశాఖ తాజాగా అధికారిక గణాంకాలను విడుదల చేసింది. 2017లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో గూండారాజ్, రౌడీయిజానికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. నేరగాళ్లకు మైదానంలోనే తగిన బుద్ధి చెప్పేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో, యూపీ మోడల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also : సతీశన్తో మారనున్న కేరళం రాజకీయ ముఖచిత్రం

17 వేలకు పైగా ఎన్‌కౌంటర్లు.. 34 వేల మంది క్రిమినల్స్ అరెస్ట్!
ప్రభుత్వం వెల్లడించిన అధికారిక నివేదిక ప్రకారం.. గత తొమ్మిదేళ్ల కాలంలో (2017 నుంచి ఇప్పటివరకు) ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా 17,043 ఎన్‌కౌంటర్ ఆపరేషన్స్ (ముఠా ఘర్షణలు మరియు ఎదురుకాల్పులు) చేపట్టారు. ఈ భారీ డౌన్‌లో 289 మంది మోస్ట్ వాంటెడ్, కరుడుగట్టిన నేరస్థులు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. అలాగే ఎదురుకాల్పుల భయంతో లొంగిపోయిన వారితో కలిపి మొత్తం 34,253 మంది క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కేవలం ఈ ఏడాది (2026) లోనే ఇప్పటివరకు జరిగిన వివిధ ఆపరేషన్లలో 23 మంది కరడుగట్టిన నేరగాళ్లు ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో క్రిమినల్స్ కాళ్లపై గాయాలతో (ఆపరేషన్ లంగ్రా) ఆసుపత్రుల పాలయ్యారు.
అమరులైన 18 మంది పోలీసులు.. ఇన్వెస్టర్లకు పెరిగిన నమ్మకం
రాష్ట్రాన్ని నేర రహితంగా మార్చే ఈ సుదీర్ఘ పోరాటంలో యూపీ పోలీసు యంత్రాంగం కూడా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. వివిధ సందర్భాల్లో నేరస్థులతో జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 18 మంది వీర పోలీసులు దేశ సేవలో ప్రాణాలర్పించి అమరులయ్యారు. అలాగే ఈ ఎన్‌కౌంటర్లలో దాదాపు 1,852 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పశ్చిమ యూపీలోని మీరట్ జోన్ అత్యధికంగా 4,813 ఎన్‌కౌంటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఒకప్పుడు అల్లర్లు, బలవంతపు వసూళ్లతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లో.. ఈ కఠిన చర్యల వల్ల నేడు పూర్తి శాంతియుత వాతావరణం నెలకొందని, ఇదే రికార్డు స్థాయి పారిశ్రామిక పెట్టుబడులను (Investments) ఆకర్షించడానికి బలమైన పునాదిగా మారిందని సీఎం యోగి స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

