Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్స్.. కృతి సనన్‌ను అలా అనేసిందేంటి?

నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్స్.. కృతి సనన్‌ను అలా అనేసిందేంటి?

వార్త 6 days ago

Rashmika Mandanna: షూటింగ్ పూర్తి చేసుకున్న కాక్‌టెయిల్ 2 మూవీ త్వరలో థియేటర్లలోకి రాబోతోంది. ముంబైలో జరిగిన ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక మందన అందరినీ ఆశ్చర్యపరిచారు.

తన సహ నటి కృతి సనన్ అందం గురించి వర్ణిస్తూ ఆమె తెలియకుండానే ఒక బూతు పదాన్ని ఉపయోగించారు. ఈ పొరపాటును వెంటనే గుర్తించిన రష్మిక.. తన తప్పును సరిదిద్దుకుంటూ అక్కడే ఉన్న వారందరికీ క్షమాపణలు చెప్పారు.

Read also: Rashmika tattoo meaning: విజయ్ దేవరకొండ కోసం కాదు.. టాటూపై రష్మిక క్లారిటీ

Rashmika Mandanna: కృతి సనన్ అందంపై రష్మిక క్రేజీ కామెంట్స్

Rashmika and Kriti at Cocktail 2 event

ఈ సినిమాలో కృతి సనన్ నటన అద్భుతంగా ఉంటుందని రష్మిక చాలా గొప్పగా చెప్పారు. కృతి చాలా హాట్‌గా కనిపిస్తుందని చెప్పే ఆవేశంలో రష్మిక నోటి నుంచి ఎఫ్ (F) అనే పదం బయటకు వచ్చింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా స్టేజ్ మీద ఉన్న వారు షాక్ తిన్నారు. అయినా రష్మిక ఏమాత్రం తడుముకోకుండా వెంటనే సారీ చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్లనే రష్మిక అంత సరదాగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

కాక్‌టెయిల్ 2 స్టోరీలో ఊహించని ట్విస్ట్

షాహిద్ కపూర్, కృతి, రష్మిక కలిసి నటిస్తున్న ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఇది ఒక విభిన్నమైన లవ్ స్టోరీ అని, ముఖ్యంగా ఇందులో కృతి, రష్మిక మధ్య ఉండే కెమిస్ట్రీ కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ స్వలింగ ప్రేమికులుగా కనిపిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త రకమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పెద్ది' ట్రైలర్ వచ్చేసింది..ఊరమాస్ లుక్‌లో రామ్ చరణ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha