Shubman Gill: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ జట్టులో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆదివారం తొలి వన్డే జరగాల్సి ఉండగా, శుక్రవారం నాటి నెట్ సెషన్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయి నేరుగా గిల్ కుడి మోచేతికి బలంగా తాకడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also : Asian Games: క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. స్క్వాష్‌లో జోష్న, సెంథిల్‌కు కాంస్యం
Captain Shubman Gill injured during net practice!
Shubman Gill: మైదానాన్ని వీడిన గిల్.. ఫిజియో అత్యవసర చికిత్స
బంతి మోచేతికి బలంగా తాకడంతో గిల్ తీవ్రమైన నొప్పితో బ్యాట్‌ను కింద పడేసి మైదానం వీడాడు. వెంటనే స్పందించిన జట్టు ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్ అతడికి దాదాపు 20 నిమిషాల పాటు ప్రాథమిక చికిత్స అందించారు. పక్క నెట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు, బౌలింగ్ చేసిన సిరాజ్ కూడా వెంటనే గిల్ వద్దకు వెళ్ళి పరామర్శించారు. అయితే గాయం తీవ్రత కారణంగా గిల్ తిరిగి బ్యాటింగ్‌కు రాలేకపోయాడు.
కలవరంలో టీమ్ మేనేజ్‌మెంట్
ఇప్పటికే హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో, ఇప్పుడు కెప్టెన్ గిల్ కూడా గాయపడటం టీమ్ మేనేజ్‌మెంట్‌ను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. గత నెలలో శ్రీలంక పర్యటనలోనూ గిల్ చేతివేలికి గాయమైనప్పటికీ కోలుకుని సిరీస్‌లో ఆడాడు. ప్రస్తుతం వైద్య బృందం గిల్ గాయాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఆదివారం నాటి తొలి వన్డేలో అతను బరిలోకి దిగుతాడా లేదా అనేదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
మరోవైపు, భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కాగా, ఈ నెల 23నే నగరానికి చేరుకున్న వెస్టిండీస్ జట్టు మాత్రం ఇంకా తమ ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించలేదు.

