Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెతన్యాహుపై ట్రంప్ ఫైర్?

నెతన్యాహుపై ట్రంప్ ఫైర్?

వార్త 1 week ago

Donald Trump : లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఫోన్ సంభాషణలో ట్రంప్ అత్యంత ఘాటైన పదజాలంతో నెతన్యాహును హెచ్చరించినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. “నీకు పిచ్చి పట్టింది.. నేను గనుక లేకపోతే నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి, నేనే నిన్ను కాపాడుతున్నాను. నీ నిర్ణయాల వల్ల ప్రస్తుతం నిన్ను అందరూ ద్వేషిస్తున్నారు, నీ వల్లే ఇజ్రాయెల్‌కు ప్రపంచవ్యాప్తంగా చెడ్డపేరు వస్తోంది” అంటూ ట్రంప్ ఫోన్ కాల్‌లోనే మండిపడ్డారు. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న కీలక రాయబార చర్చలకు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న మితిమీరిన దాడులు అడ్డుకట్ట వేసేలా ఉన్నాయనే కోపంతోనే ట్రంప్ ఇంతగా ఫైర్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : గూగుల్ దోమల్లో ఉండే ఆ ప్రత్యేక బ్యాక్టీరియా ఏంటో తెలుసా?

అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరితనంపై ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్ తన రక్షణ కోసం జరుపుకునే దాడులను అమెరికా సమర్థించినప్పటికీ, వైమానిక దాడుల వల్ల లెబనాన్‌లో జరుగుతున్న పౌర నష్టాన్ని (Civilian Casualties) ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం ఒకరిద్దరు హెజ్బొల్లా కమాండర్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద పెద్ద భవనాలను కూల్చేయడం సమంజసం కాదని నెతన్యాహుకు స్పష్టం చేశారు. ఈ మొండి వైఖరి వల్ల అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ పూర్తిగా ఒంటరిదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికల అనంతరం ఇజ్రాయెల్ తన వ్యూహాన్ని మార్చుకుని, బీరూట్‌పై చేయాలనుకున్న ప్రధాన దాడులను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. అయితే బహిరంగంగా మాత్రం హెజ్బొల్లా దాడులు ఆపకపోతే తాము వెనక్కి తగ్గేదే లేదని నెతన్యాహు కార్యాలయం ప్రకటనలు విడుదల చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha