Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి బంగారం ధరలు ఇవే!

నేటి బంగారం ధరలు ఇవే!

వార్త 1 month ago

Gold Prices Today: మన దేశంలో బంగారానికి డిమాండ్ ఉండటం వల్ల విదేశాల నుంచి టన్నుల కొద్దీ దిగుమతి అవుతుంటుంది. అయితే ఇటీవల కాలంలో పసిడి ధరలు భారీగా పెరిగిపోవడం సామాన్యులను ఆందోళనకు గురిచేసింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సమయంలో ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రితం రోజు తగ్గిన పసిడి రేట్లు.. నేడు కూడా అదే బాటలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

హైదరాబాద్‌లో నేటి పసిడి, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్ప తగ్గుదల తర్వాత స్థిరంగా కొనసాగుతున్నాయి. నగరంలో 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,63,750 వద్ద ఎలాంటి మార్పు లేకుండా అమ్ముడవుతోంది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,50,100 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ప్రియులకు భారీ ఊరట లభించింది. క్రితం రోజు కిలో వెండి ఏకంగా రూ. 10,000 వరకు తగ్గగా, నేడు కూడా అదే ధర వద్ద కొనసాగుతూ కిలో రూ. 2,65,000 వద్ద ట్రేడవుతోంది.

Read also: UPI 10 Years: యూపీఐకి పదేళ్లు..మోదీకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Gold Prices Today: విజయవాడ, విశాఖపట్నంలో బంగారం రేట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరాలైన విజయవాడ మరియు విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్‌ను పోలి ఉన్నాయి. ఇక్కడ కూడా ఈరోజు పసిడి రేట్లలో ఎలాంటి హెచ్చుతగ్గులు నమోదు కాలేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులానికి రూ. 1,63,750 వద్ద విక్రయమవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,50,100 వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధర రూ. 2,65,000 మార్క్ వద్ద స్థిరంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో గ్లోబల్ గోల్డ్ ట్రెండ్

స్థానిక మార్కెట్లతో పాటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు సుమారు 16 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4,621 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు మాత్రం స్వల్పంగా 0.58 శాతం పెరిగి ఔన్సుకు 69 డాలర్ల వద్ద కొనుగోలుదారులకు లభిస్తోంది.

అమెరికా-కెనడా మధ్య తీవ్రతరమైన వాణిజ్య యుద్ధం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha