Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి నుంచి పాపికొండల బోటింగ్ షురూ

నేటి నుంచి పాపికొండల బోటింగ్ షురూ

వార్త 1 week ago

Papikondalu trip: గోదావరి వరదల ఉద్ధృతి కారణంగా నిలిచిపోయిన ప్రసిద్ధ పాపికొండల విహారయాత్ర సుమారు 70 రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. నదిలో నీటిమట్టం తగ్గి ప్రయాణానికి పరిస్థితులు అనుకూలంగా మారడంతో పర్యాటక బోట్లకు అధికారులు అనుమతులు జారీ చేశారు.

రంపచోడవరం సబ్‌ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

CM Vijay: నేడు కనకదుర్గమ్మను దర్శించుకోనున్న తమిళనాడు సీఎం విజయ్‌

16 టూరిజం బోట్లు సిద్ధం

గోదావరి ఉద్ధృతి వల్ల జులై 30 నుంచి బోటు ప్రయాణాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయ రేవు నుంచి పాపికొండల వైపు ప్రయాణించేందుకు ఏపీటీడీసీ (APTDC)కి చెందిన ఒక బోట్‌తో పాటు 15 ప్రైవేట్‌ బోట్లు, మొత్తం 16 బోట్లను నిర్వాహకులు సిద్ధంగా ఉంచారు.

దసరా సెలవులతో పర్యాటకుల సందడి

ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతుండటంతో పాపికొండల అందాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు, బోటు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దీంతో బోట్ పాయింట్ల వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పర్యాటక ప్రాంతాల్లో మళ్లీ సందడి మొదలైంది.

రాజమహేంద్రవరం నుంచి ప్రయాణం ఇలా..

విహారయాత్రకు వచ్చే పర్యాటకులు ముందుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడి గోదావరి గట్టు నుంచి బోటు నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనాల్లో రోడ్డు మార్గాన సీతానగరం మీదుగా పోశమ్మగండి చేరుకుంటారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పాపికొండల బోటు ప్రయాణం ప్రారంభమవుతుంది. గోదావరి అందాలు, ఎత్తైన కొండల మధ్య సాగే ఈ యాత్ర ముగించుకుని తిరిగి రావడానికి దాదాపు ఏడు గంటల సమయం పడుతుంది.

పర్యాటకులకు ముఖ్యమైన భద్రతా సూచనలు

ప్రయాణం సురక్షితంగా సాగేందుకు అధికారులు పర్యాటకులకు పలు సూచనలు చేశారు.

బోట్ ఎక్కిన ప్రతి పర్యాటకుడు నిర్వాహకుల నుంచి లైఫ్ జాకెట్ తీసుకుని తప్పనిసరిగా ధరించాలి.

ప్రయాణంలో ఉన్నప్పుడు బోటు అంచుల వద్ద నిలబడి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరం.

యాత్ర ముగిసే వరకు చిన్న పిల్లలను గమనిస్తూ, బోటు అంచుల వైపు వెళ్లకుండా చూసుకోవాలి.

పర్యాటకులందరూ ఒకే వైపునకు చేరడం వల్ల బోటు బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉంది.

ధ్రువపత్రాలు, భద్రతా పరికరాలు తనిఖీ

పోచవరం పాపికొండల పర్యాటక రేవులో చింతూరు ఐటీడీఏ పీవో నరేంద్ర పడాల్‌ బోట్లను తనిఖీ చేశారు. ప్రతి బోట్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సరిగ్గా ఉండాలని, పర్యాటకుల భద్రతా పరికరాల నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నాణ్యత లేని లైఫ్‌ జాకెట్లను వెంటనే మార్చాలని, ధ్రువపత్రాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Epaper: epaper.vaartha.com

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha