Telangana Voter List Revision: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. భవిష్యత్తులో మీరు మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఈ 'సిర్' ప్రక్రియలో పాల్గొనడం అత్యంత విధిగా మారింది.
అధికారులు అడిగిన పత్రాలను చూపించి మీ ఓటును నిర్ధారించుకోకపోతే, లేదా సరైన సమాచారం ఇవ్వకుంటే మీ ఓటు హక్కు ప్రమాదంలో పడే (గల్లంతయ్యే) అవకాశం ఉంది. అందువల్ల బూత్ స్థాయి అధికారులు (BLO) మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా వారికి సహకరించి వివరాలు అందజేయాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3,38,26,228 మంది ఓటర్ల డేటాను వడపోసే బృహత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కేవలం ఓటరు కార్డు ఉండటమే కాదు.. అందులో మీ పేరు, ఫొటో, అడ్రస్ వంటి వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఇదే సరైన సమయం.
Read Also : Mahabubnagar news: యువత.. జాగ్రత్త! మత్తుకు దూరంగా..
SIR process starts from today!.. Check your vote details
Telangana Voter List Revision: జులై 24 వరకు ‘మెగా సర్వే’.. ప్రతి ఇంటికీ మూడుసార్లు విజిట్
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నేటి నుంచి జులై 24 వరకు అంటే నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇంటింటి ఓటర్ల సర్వే సాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36,000 మంది బీఎల్‌వోలు పాల్గొంటున్నారు. ప్రతి బీఎల్‌వో తన బూత్ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్లకు రెండు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేస్తారు. ఇందుకోసం వారు ప్రతి ఇంటినీ మూడు సార్లు సందర్శిస్తారు. హైదరాబాద్ పరిధిలో ఈ పత్రాలు ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంటాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో తెలుగులో అందజేస్తారు. మీరు పూర్తి చేసిన రెండు పత్రాలలో ఒకదాన్ని బీఎల్‌వో తీసుకుని, రెండో దాన్ని మీకు రసీదుగా ఇస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం ఈ రసీదును జాగ్రట్టగా దాచుకోవాలి.
ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నారా? ఆన్‌లైన్‌లోనే స్మార్ట్ ఆప్షన్!
ఉద్యోగ, వ్యాపార పనుల వల్ల ఇంట్లో ఉంటూ బీఎల్‌వోల కోసం ఎదురుచూసే సమయం లేని వారి కోసం ఎన్నికల సంఘం డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. టెక్ సావీ ఓటర్లు నేరుగా https://voters.eci.gov.in అనే అధికారిక పోర్టల్‌లోకి వెళ్లాలి. మీ మొబైల్ నెంబర్ లేదా ఎపిక్ (EPIC) కార్డ్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వచ్చు. అయితే, మీ ఓటరు జాబితాలోని వివరాలు, ఆధార్ కార్డులోని పేరు పరస్పరం సరిపోలితేనే ఈ ఆన్‌లైన్ డిజిటల్ సేవలు వర్తిస్తాయి.
చాలా మంది ఓటర్లలో మ్యాపింగ్, అన్‌మ్యాపింగ్‌పై గందరగోళం ఉంటుంది. బీఎల్‌వోలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఓటు ఆ ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యుల ఓట్లతో మ్యాపింగ్ అయిందా లేదా అనేది వారి వద్ద ఉన్న రికార్డుల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇల్లు మారినా లేదా వివరాలు తప్పుగా ఉన్నా వాటిని ఎలా సరిచేయాలో బీఎల్‌వోలు మీకు వివరిస్తారు. ఒకవేళ మీ ప్రాంతానికి బీఎల్‌వో రాకపోయినా, లేదా ఓటుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా తక్షణమే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు డయల్ చేసి తగిన పరిష్కారం పొందవచ్చు.
మూడు తరాల సమస్య 33 గేట్ల ప్రారంభంతో తీరబోతోంది.. రేవంత్ రెడ్డి

