Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి రాశి ఫలాలు - 20 మే 2026 telugu

నేటి రాశి ఫలాలు - 20 మే 2026 telugu

వార్త 4 days ago

Today Rasi Phalalu : రాశి ఫలాలు - 20 మే 2026

 మేష రాశి

మేషరాశి వారికి ఈ రోజు లౌక్యం లోపించడం వల్ల కొన్ని సందర్భాల్లో అనుకోని అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది.

మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. దీనివల్ల ప్రత్యక్ష నష్టం లేకపోయినా సమాజంలో మీపై కొంత దుష్ప్రచారం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


వృషభ రాశి

వృషభరాశి వారికి ఈ రోజు ఇతరులు మీ సామర్థ్యంపై పెట్టుకున్న అంచనాలు పూర్తిగా తలక్రిందులు అవుతాయి. నిర్వహించలేరని భావించిన పనులను మీరు ధైర్యంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు.


మిథున రాశి

మిథునరాశి వారికి ఈ రోజు కొన్ని పరిస్థితులు మీ ఆలోచనలకు విరుద్ధంగా సాగవచ్చు. ఇష్టం లేకపోయినా, పూర్తి నమ్మకం లేకపోయినా కొందరిపై తాత్కాలికంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.


కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఉద్యోగ సంబంధిత విషయాలలో కొంత అప్రమత్తత అవసరం అవుతుంది. గతంలో ఇబ్బందులు కలిగించిన వర్గం మళ్లీ చురుకుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుపై అనవసర విమర్శలు వచ్చే అవకాశముంది.


సింహ రాశి

సింహరాశి వారికి ఈ రోజు కుటుంబపరమైన విషయాలలో కొంత అసౌకర్యకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. ఇంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేశారని కొందరు విమర్శించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఉద్దేశ్యం మంచిదైనా ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు.


కన్యా రాశి

కన్యరాశి వారికి ఈ రోజు నిర్మాణ సంబంధమైన విషయాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. పనుల్లో చిన్న చిన్న లోపాలను మీరు గుర్తించే అవకాశం ఉంది. మీ పరిశీలనా శక్తి ఇతరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏ పని చేసినా పరిపూర్ణత కోసం ప్రయత్నించడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది.


తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో కొంత స్పష్టత లభించే అవకాశం ఉంది. అధిక మొత్తంలో ధనం ఖర్చయినా ఇప్పటివరకు ఎందుకు సరైన లెక్కలు కనిపించడం లేదో మీకు అర్థమవుతుంది. కొన్ని విషయాల్లో ఇతరుల నిర్లక్ష్యం బయటపడే సూచనలు ఉన్నాయి.


వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈ రోజు వ్యక్తిగత విషయాలలో అత్యంత జాగ్రత్త అవసరం అవుతుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆసరాగా తీసుకొని కొందరు మీకు అనేక విధాలుగా నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని గుర్తించే అవకాశం ఉంది.


ధనుస్సు రాశి

ధనుస్సురాశి వారికి ఈ రోజు కుటుంబపరంగా ఆనందకరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. సంతాన పురోగతి సంతృప్తికరంగా ఉండటంతో మీలో ఆనందం పెరుగుతుంది. పిల్లలకు విద్య, ఉద్యోగం లేదా ఇతర రంగాలలో మంచి అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.


మకర రాశి

మకరరాశి వారికి ఈ రోజు సాంకేతిక కారణాల వల్ల కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. మొదట్లో ఇది నిరాశ కలిగించినప్పటికీ తరువాత అదే పరిస్థితి మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.


కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో అనుకున్న దానికంటే ఎక్కువ వ్యయం జరిగే అవకాశం ఉంది. కొన్ని అవసరమైన ఖర్చులు అకస్మాత్తుగా పెరగడంతో ఆందోళన కలిగినా పరిస్థితులను సమర్థంగా నిర్వహించగలుగుతారు. డబ్బు వ్యవహారాలలో ముందుచూపుతో వ్యవహరించడం మంచిది.


మీన రాశి

మీనరాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు రావలసిన ధనం, బిల్లులు లేదా పెట్టుబడులకు సంబంధించిన మొత్తాలు సమయానికి అందకపోవడంతో అసౌకర్య పరిస్థితులు ఏర్పడవచ్చు.


వారం – వర్జ్యం

తేది : 20-05-2026, బుధవారం

శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం , ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం , రోహిణి కార్తె

చవితి ఉ.11.10, ఆరుద్ర ఉ.6.12, పునర్వసు తె.4.13

వర్జ్యం: సా.5.12-సా. 6.40

దు.మూ ఉ.11.38 – మ. 12.30 –

రాహుకాలం:మ. 12.00 – 1.30

రాశి ఫలాలు

మేష రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహ రాశి కన్య రాశి తుల రాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మకరం రాశి కుంభ రాశి మీన రాశి
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha