Dailyhunt
Nikitha: నిఖిత హత్య కేసులో కొత్త మలుపు

Nikitha: నిఖిత హత్య కేసులో కొత్త మలుపు

వార్త 3 months ago

మెరికాలో హత్యకు గురైన భారతీయ యువతి నిఖిత (Nikitha) హత్య కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆర్థిక లావాదేవీల వల్లే ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడి పరిస్థితికి జాలిపడి అప్పు ఇవ్వడమే నిఖిత పాలిట శాపమైంది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఏకంగా ఆమెను హత్య చేశాడు అర్జున్ శర్మ. అమెరికాలో ఉంటున్న నిఖిత, తమిళనాడుకు చెందిన అర్జున్‌ శర్మ ఇద్దరు స్నేహితులు.

Read also:TG: విశ్రాంత ఉద్యోగుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. అరెస్టులు

నాలుగున్నర వేల డాలర్లు అప్పుగా ఇచ్చిన నిఖిత

ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్జున్ శర్మ.. నిఖిత (Nikitha) వద్ద నుంచి నాలుగున్నర వేల డాలర్లు అప్పుగా తీసుకున్నాడు. త్వరలోనే తీరుస్తానని మాట ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన నిఖిత.. అర్జున్‌ శర్మ అడిగిన మొత్తం ఇచ్చింది. డబ్బులు తీసుకున్న తర్వాత.. నెలలు గడుస్తున్నా అర్జున్‌ శర్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడు.. డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నిఖిత అర్జున్ శర్మపై ఒత్తిడి తెచ్చింది.

దీంతో అతడు మూడున్నరవేల డాలర్లు ఇచ్చాడు. మిగిలిన 1000 డాలర్లు కూడా ఇవ్వాలని కోరడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన అర్జున్ శర్మ.. నిఖితకు ఇచ్చిన డబ్బులను బలవంతంగా తిరిగి తనకు పంపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి.. ఇండియాకు పారిపోయి వచ్చాడు. నిఖిత హత్య గురించి తెలుసుకున్న ఇంటర్‌ పోల్‌ పోలీసులు.. తమిళనాడులో అర్జున్‌ శర్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Medak Crime: సొమ్ము కోసం తండ్రిని అంతమొందించిన తనయుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha