Gold price hike : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, కేంద్రం దిగుమతి సుంకాన్ని (Import Duty) 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచింది.
ఈ ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే మార్కెట్‌లో ధరలు ఊహించని రీతిలో ఎగబాకాయి.
హైదరాబాద్‌లో రికార్డు స్థాయికి పసిడి ధరలు
దిగుమతి సుంకం పెంపుతో హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 12,750 పెరిగి రూ. 1,53,900 కి చేరగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 13,910 పెరిగి రూ. 1,67,890 వద్ద ట్రేడవుతోంది. ఒక్కరోజులోనే ఈ స్థాయిలో ధరలు పెరగడం సామాన్య కొనుగోలుదారులకు కోలుకోలేని షాక్ అని చెప్పవచ్చు.
Read Also:Kalyandurgam MLA : మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ఎమ్మెల్యే సురేంద్ర బాబు
Gold price hikeవెండి ధరల్లో మునుపెన్నడూ లేని జంప్
బంగారంతో పాటే వెండి ధరలు కూడా రికార్డులను తిరగరాశాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో కేవలం నిమిషాల వ్యవధిలోనే వెండి ధర రూ. 22 వేలు పెరగగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 3.30 లక్షల మార్కును తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, దేశీయంగా పన్నుల పెంపు మరియు రూపాయి విలువ పతనం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

