Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరసనల్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వొద్దు- సీఎం యోగి ఆదేశాలు

నిరసనల్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వొద్దు- సీఎం యోగి ఆదేశాలు

వార్త 3 weeks ago

UP GOVT : ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలనలో మార్పు కోరుతూ జరిగే నిరసనల్లో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ప్రవర్తన, గత కార్యకలాపాలను పరిశీలించిన అనంతరం నియామకంపై నిర్ణయం తీసుకునేలా ఈ నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. అయితే రాజకీయ భావజాలం, అభిప్రాయాలు లేదా శాంతియుత నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో మాత్రమే అభ్యర్థులకు ఉద్యోగాలను నిరాకరించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయిన సందర్భాల్లోనే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

 Yogi Adityanath

బ్రిటిష్ పాలనను గుర్తుచేస్తోంది: సమాజ్‌వాదీ పార్టీ విమర్శ

యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (SP) విమర్శలు గుప్పించింది. ఈ నిబంధనలు బ్రిటిష్ పాలన నాటి విధానాలను గుర్తుచేస్తున్నాయని ఆరోపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కును పరిమితం చేసే చర్యగా దీనిని చూడాల్సి వస్తుందని ప్రతిపక్షం అభిప్రాయపడుతోంది. మరోవైపు, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోకూడదన్నదే తమ నిర్ణయ ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ పరిణామంతో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా ప్రమాణాలు, అభ్యర్థుల నేపథ్య పరిశీలన వంటి అంశాలపై రాజకీయ చర్చ మొదలైంది. ఈ నిబంధనల అమలు తీరు, అభ్యర్థులపై తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత ఎలా ఉంటుందన్నది భవిష్యత్తులో కీలకంగా మారనుంది.

సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు ఆదేశం.. నవంబర్ 17న స్వయంగా హాజరు కావాలని సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha