Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిర్మాతకు పదవి ఇచ్చిన సీఎం విజయ్..!

నిర్మాతకు పదవి ఇచ్చిన సీఎం విజయ్..!

వార్త 2 weeks ago

CM Vijay : తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులకు కీలక పదవులు దక్కుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత, AGS ఎంటర్టైన్మెంట్ CEO అర్చన కల్పతికి తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆలయాల్లో వంశపారంపర్యేతర (CM Vijay ) ధర్మకర్తలను నియమించే టెంపుల్ కమిటీ ట్రస్ట్ సభ్యురాలిగా అర్చన కల్పతిని ప్రభుత్వం నియమించినట్లు సమాచారం.

అర్చన కల్పతికి త్రిషతో సన్నిహిత సంబంధాలు :

అర్చన కల్పతి తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందారు. AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా స్టార్ హీరో విజయ్ నటించిన 'బిగిల్', 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)' వంటి సినిమాలతో ఆమె పేరు మరింతగా ప్రేక్షకులకు పరిచయమైంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాల నిర్మాణంలో అర్చన కీలక పాత్ర పోషించారు. ఇక అర్చన కల్పతికి హీరోయిన్ త్రిషతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సినీ వర్గాల్లో తరచూ చర్చ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉండగా తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) చుట్టూ కూడా ఇలాంటి నియామకాలపై చర్చ జరుగుతోంది.విజయ్ నటించిన 'జన నాయకన్' చిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణన్‌ను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో సినీ రంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ బాధ్యతలు దక్కుతున్నాయనే చర్చ మొదలైంది.

అయితే అర్చన కల్పతి నియామకం పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమేనా, లేక దీనికి రాజకీయ సమీకరణాలు కూడా కారణమా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.అర్చనకు అప్పగించిన బాధ్యత ఆలయ పరిపాలనకు సంబంధించినది కావడంతో, ఆమె కొత్త బాధ్యతలను ఎలా నిర్వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇండియాలో స్పైడర్ మ్యాన్ రికార్డు వసూళ్లు..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha