Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త

నిరుద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త

వార్త 1 month ago

AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీపీఎస్సీ (APPSC) తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా చేపట్లే ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

నాన్-యూనిఫాం (Non-Uniform) పోస్టులకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని గతంలో ఉన్న 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. గతంలో నోటిఫికేషన్లు రాక ఏళ్లుగా నిరీక్షిస్తూ, వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న వేలాది మంది నిరుద్యోగ యువతకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.

యూనిఫాం పోస్టులకూ సడలింపు: 2027 సెప్టెంబర్ వరకు వర్తింపు

సాధారణ ఉద్యోగాలతో పాటు పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్, జైళ్ల శాఖ వంటి యూనిఫాం (Uniform) పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సైతం ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. ఈ కేటగిరీ పోస్టులకు ప్రస్తుతం నిర్దేశించిన ఏజ్ లిమిట్‌కు అదనంగా మరో 2 ఏళ్ల వయోసడలింపును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన వయోపరిమితి నిబంధన 2027 సెప్టెంబర్ వరకు వెలువడే అన్ని రకాల ఉద్యోగ ప్రకటనలకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ మరియు పోలీసు నియామకాల ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగులు పోటీపడేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.

కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కేశినేని చిన్ని

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha