Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు

వార్త 1 week ago

APPSC Jobs 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) నుంచి కీలక సమాచారం వెలువడింది.

మొత్తం ఐదు నోటిఫికేషన్ల ద్వారా వివిధ విభాగాల్లో 254 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో అత్యధికంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్, ఫ్యాక్టరీస్ విభాగం, అసెంబ్లీ సర్వీసుల్లోనూ ఖాళీలు ఉన్నాయి.

Read Also :APP Exam Results: తెలంగాణ APP ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి

ఏ విభాగంలో ఎన్ని పోస్టులు?

అందించిన వివరాల ప్రకారం, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ విభాగంలో 196 పోస్టులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎనలిస్ట్ గ్రేడ్‌-2 కింద 18 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో 17 పోస్టులు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విభాగంలో 12 పోస్టులు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ సర్వీసుల్లో ఆంగ్ల భాషా రిపోర్టర్ పోస్టులు 10, తెలుగు భాషా రిపోర్టర్ పోస్టు ఒకటి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, వయోపరిమితి, ఫీజు, చివరి తేదీ వంటి వివరాలను సంబంధిత నోటిఫికేషన్లలో పరిశీలించాలి.

APPSC Jobs 2026: దరఖాస్తు వివరాలు ఎక్కడ తెలుసుకోవాలి?

అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్లు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు గడువు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత పోస్టుకు అవసరమైన విద్యార్హతలు, ఇతర నిబంధనలను జాగ్రత్తగా చదవాలి.

అధికారిక వెబ్‌సైట్:https://portal-psc.ap.gov.in/Default

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక ప్రకటనలోని సూచనలను అనుసరించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

డిజిలాకర్ తో నకిలీ సర్టిఫికెట్లకు చెక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha