NEET paper leak Supreme Court: నీట్ పేపర్ లీక్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇన్ని నిఘా వ్యవస్థలు, పర్యవేక్షణ కమిటీలు ఉన్నప్పటికీ పేపర్ ఎలా లీకైందో చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇలాంటి బాధ్యతారాహిత్య ఘటనల వల్ల పరీక్షలు రాసే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పేపర్ లీక్ వ్యవహారంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అప్పటివరకు అసలు సమస్య ముగియనట్లేనని స్పష్టం చేసింది.
ఈ విచారణ సందర్భంగా జస్టిస్ పి.ఎస్. నరసింహ స్పందిస్తూ ఎన్‌టీఏకు గట్టిగా చీవాట్లు పెట్టారు. సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ (UPSC)లో ఇలాంటి లీకేజీ ఉదంతాలు ఎప్పుడూ చూడలేదని, ఆ సంస్థను చూసి ఎన్‌టీఏ నేర్చుకోవాలని సూచించారు. గతంలో ఎన్నో భద్రతా రక్షణలు ఏర్పాటు చేసినా, ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా సాధ్యపడిందని ప్రశ్నించారు. ఈ కోర్టు విచారణకు ఎన్‌టీఏ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అలాగే నీట్ వ్యవస్థ ప్రక్షాళనకు ఏర్పాటైన హైలెవెల్ కమిటీ చైర్మన్, ఇస్రో మాజీ చీఫ్ డా. రాధాకృష్ణన్ హాజరయ్యారు.
Read Also: India Oil Supply : హార్ముజ్ సంక్షోభం.. ప్రపంచానికి షాక్, భారత్‌కు మాస్టర్ ప్లాన్!
Supreme Court is angry over NEET leakage.. It is necessary to decide who is responsible!
NEET paper leak Supreme Court:: ప్రశ్నాపత్రం రూపకల్పనలోనే లోపం: డా. రాధాకృష్ణన్
సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలపై డా. రాధాకృష్ణన్ బదులిస్తూ.. ప్రశ్నాపత్రం రూపకల్పన దశలోనే పేపర్ లీకేజీ జరిగిందని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఆ లోపాలన్నింటినీ సరిదిద్ది వ్యవస్థను మరింత బలోపేతం చేశామని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా గతంలో మొత్తం 101 సూచనలు చేశామని, అందులో 60 తాత్కాలిక సూచనలను 2025-26 పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగవని, సంస్కరణలే తమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేవలం సంస్కరణలు, నివేదికలతోనే పరిస్థితి చక్కబడదని తప్పు జరిగినప్పుడు దానికి బాధ్యత ఎవరిదనే దానిపై స్పష్టత ఉండాలని, బాధ్యులను తేల్చకుండా ఎన్ని కమిటీలు వేసినా, మీటింగ్‌లు పెట్టినా ఫలితం ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పేపర్ లీక్‌పై విచారణ వేగంగా జరుగుతోందని, తదుపరి పరీక్షల కోసం కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రధానమంత్రి స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని, ప్రభుత్వం దీనిని అత్యంత సీరియస్‌గా తీసుకుందని కోర్టుకు తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆరు వారాల గడువు ఇస్తూ, కేసు విచారణను జూలై రెండో వారానికి కోర్టు వాయిదా వేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

