Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర న్యాయ విచారణ జరపాలి..వామపక్షాల డిమాండ్

నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర న్యాయ విచారణ జరపాలి..వామపక్షాల డిమాండ్

వార్త 3 days ago

NEET paper leak: నీట్ పేపర్ లీకేజీ ఘటన కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాల దారుణ వైఫల్యానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు.

నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేసి స్వతంత్ర, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రవేశ పరీక్షల నిర్వహణ హక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఎ, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్ఈయ్యూ, పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి. నాగరాజు, పుట్టా లక్ష్మణ్, ఎస్. అనిల్, పొడపంగి నాగరాజు అధ్య క్షత వహించారు. సమావేశంలో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also : Bandi Sanjay : కట్ట కాలేదాకా బీజేపీ వీడను..!

 A thorough judicial inquiry should be conducted into the NEET paper leak

NEET paper leak: విద్య కార్పొరేటీకరణ, రాష్ట్రాల హక్కుల హరణ

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లా డుతూ దేశంలో విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ దిశగా నెట్టివేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రవేశ పరీక్షలను కేంద్రీకరించడం ద్వారా రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్యంగా వ్యవహరిస్తోం దన్నారు. నీట్ పరీక్షను పూర్తిగా స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కోచింగ్ మాఫియా వ్యాపారంపై ఆందోళన

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ భారత రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన విద్యా హక్కులను కేంద్రం క్రమంగా హరించేస్తోందన్నారు. గ్రామీణ, ప్రభుత్వ విద్యార్థులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుండగా, కోచింగ్ మాఫియా మాత్రం వేల కోట్ల వ్యాపారం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలు పూర్తిగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా సాగుతున్నాయని అన్నారు. విద్యను ప్రజల హక్కుగా కాకుండా వ్యాపార వస్తువుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మధ్యాహ్నం వేళ ప్రయాణాలు మానుకోండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha