NEET EXAM : ఆశయం జీవితానికి విలువ నేర్పుతుంది. ఆశ జీవితాన్ని ఆటపట్టిస్తుంది. కానీ ఆ ఆశే అత్యాశగా మారి దురాశగా రూపాంతరం చెందితే అరాచకానికి, అక్రమాలకు అంతే ఉండదు.
నీతి, నియమాలకు, నైతిక విలువలకు తావే ఉండదు. ఇతర రంగాల సంగతి ఏమోకానీ విద్యారంగంపై ఈ ప్రభావం తీవ్రంగా చూపుతున్నది. కష్టపడకుండా తెల్ల వారేసరికి లక్ష్మిపుత్రులై కోట్లకు పడగెత్తాలనే కొందరి దురాశ విద్యారంగంలో పెచ్చురిల్లుతుండడంతో దేశవ్యాప్తంగా లక్ష లాది మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతు న్నాయి. పాలకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబు తున్నా మరెంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశ్న పత్రాలు ఏ పరిస్థితుల్లో లీక్కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకుంటున్నా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఏదో ఒక రూపంలో ఏదో రకంగా లీక్లు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఆయా రాష్ట్రాల పరిధి లో జరుగుతున్న ఇంటర్మీడియేట్ తర్వాత ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవతలు అన్నీఇన్నీ కావు. పేపర్లు లీక్ కావడం, మరొకచోట వాల్యూయేషన్లో కొందరు అధ్యాపకులే చేతి వాటం ప్రదర్శించడంతో ఎన్నోసార్లు ఏకంగా పరీక్షలే రద్దు చేసి మళ్లీ పెట్టిన సంఘటనలు కోకొల్లలు.
NEET EXAM
NEET EXAM : పక డ్బందీగా
ముఖ్యంగా మెడి కల్ విద్యకు జరిగే ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాల విషయంలో ప్రభుత్వ చర్యలేవీ లీక్లను ఆపలేకపోయాయి. దేశ అత్యు న్నత న్యాయస్థానం ఆదేశాలతో వైద్యవిద్య కోర్సుల ప్రవేశా లకు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ ఎగ్జిబులిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్’ (నీట్) ను ప్రవేశపెట్టారు. 2013 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల్లో మొదట్లో కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సిబిఎస్ఇ) నిర్వహించేది. 2017 నుంచి కేంద్ర విద్యాశాఖ పరిధిలోని జాతీయ పరీక్షా సంస్థ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ – ఎన్టీఏ) నిర్వహిస్తుంది. పక డ్బందీగా లీక్ ఫ్రూవ్ గా ఈ పరీక్షలు నిర్వహించాలని తద్వారా ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అనుమానాలకు తావులే కుండా నమ్మకం, విశ్వాసం కలిగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా ఎన్టీఏ వ్యవహరించలేక చతికిలపడుతున్నది. తాజాగా ఈ నెల మూడవ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షలు లీక్ కారణంగా పరీక్షలు రద్దు చేశారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రాలు రాజస్థాన్లో లీక్ అయి నట్లు వార్తలు రాగానే ఎలాంటి లీక్ లు లేవని ఎంతో పక డ్బందీగా నిర్వహించినట్లు ప్రకటించిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ పరీక్షలు రాసిన దాదాపు 23 లక్షల
మంది విద్యార్థులే కాదు వారి తల్లితండ్రులు హతాశులయ్యారు. పరీక్షలకు మూడు, నాలుగు రోజుల ముందే గెస్ పేపర్ రూపంలో అందులోని ప్రశ్నలు వాట్సాప్లో ప్రత్యక్షం కావడం.
లీక్ లు సర్వసాధారణమైపోయాయి
కేంద్ర దర్యాప్తు సంస్థ ఆగమేఘాలపై జరిపిన ప్రాథ మిక దర్యాప్తులో లీక్ జరిగినట్లు తేలడంతో రద్దు చేయక తప్పలేదు. నీట్ పరీక్షలు రద్దుకావడం ఇది మొదటిసారి కాదు. 2024లో కూడా ఇలాంటి ఆరోపణలే వెలుగెత్తాయి. ప్రజలనుండి నిరసనలు వెలువెత్తడంతో దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలు విస్తుగొల్పాయి. 30 మందినిపైగా అరెస్టు చేశారు. మరోపక్క పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిర్వహించేందుకు 2024 ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. కానీ మళ్లీ లీక్ పునరావృతం అయింది. ఈ లీక్లలు అనేది కొత్తగా వచ్చిందికాదు. చివరిది కూడా కాక పోవచ్చు. ఎంసెట్ ఆరంభం నుంచి ప్రశ్నపత్రాల్లో తప్పులు, లీక్ లు మామూలుగా మారిపోయాయి. బయటపడినప్పుడు తప్పని పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయడం, తిరిగి పరీక్షలు పెట్టడం నిందితులపై కేసులు పెట్టడం, ఆ తర్వాత మరచి పోవడం, కేసులను అటకెక్కించడం సర్వసాధారణమైపో యింది. ఇంజినీరింగ్కు కొంత డిమాండ్తగ్గినా మెడికల్ సీట్లకు రానురాను డిమాండ్ పెరుగుతూనే ఉంది. వైద్య విద్య అనేది పేదలకే కాదు, మధ్యతరగతి వారికి అందని ద్రాక్షపండులా తయారు అయింది.
మానసిక వేదన
మెడికల్ సీటు మేన్ మెంట్కోటాలో అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఎనిమిదో తరగతి నుండే శిక్షణ ఇప్పించే తల్లిదండ్రులు ఉన్నారు. అప్పటి నుండి పిల్లలు కూడా పండుగలు, పబ్బాలు, శుభకార్యాలే కాదు కుటుంబ సభ్యులు మరణించినా రాలేని, చివరి చూపులకు కూడా నోచుకోకుండా సర్వం మెడికల్ విద్యపైనే దృష్టి పెట్టి చదు వుతున్న విద్యార్థులు లక్షల సంఖ్యలో ఉన్నారు.మరొకపక్క మెడికల్పై ఉన్న మోజు సొమ్ము చేసుకునేందుకు కొన్ని ముఠాలు ఏనాటి నుంచో ఒక వ్యూహం ప్రకారం ప్రశ్నపత్రా లు సంపాదించడం, సొమ్ము చేసుకోవడం జరుగుతూనే ఉంది. ఈ లీక్ వీరులకు పోలీసులన్నా, చట్టాలన్నా భయ భక్తులు లేకుండా పోతున్నాయి. ఏదిఏమైనా ప్రస్తుతం రద్దు చేసిన పరీక్షలు వచ్చేనెల 21వ తేదీ నిర్వహిస్తామని ప్రకటిం చారు. ఈసారి ఏపరిస్థితుల్లోను లీక్ అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకొంటున్నట్లు శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ పాతపాటే పాడారు. పరీక్షలు రద్దు చేసి మళ్లీ పెడితే ఆ విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఎంతటి మానసిక వేదనకు, ఒత్తిడికి గురవుతారో మనసుపెట్టి ఆలో చించాలి. మళ్లీ కోచింగ్ సెంటర్లలలో ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో చెప్పక్కరలేదు. ఇక ప్రశ్నపత్రాలు లీక్ బయటపడకుండా ఉంటే అవి కొన్నవారు, చేజిక్కించుకున్న వారు అందలమెక్కిపోతున్నారు.
NEET EXAM
కఠిన చర్యలు విఫలం
ప్రశ్నపత్రాలు లీక్ అయి నట్లు స్పష్టంగా బయటపడిన సందర్భాల్లో కూడా పాలకులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే చెప్పొ చ్చు. అధికారంలో ఎవరు ఉన్నా, ఈ పరీక్షల నిర్వహణలో మాత్రం అవకతవకలను
నిరోధించలేకపోతున్నారు. గతంలో కూడా బయటపడిన సందర్భాల్లో విధిలేని పరిస్థితుల్లో రద్దు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారే తప్ప కారకులైనవారిపై పటి ష్టమైన చర్యలు తీసుకొని మళ్లీ మళ్లీ పునరావృతం కాకుం డా చేయలేకపోతున్నారు. ఏదిఏమైనా ఈ పరీక్షల నిర్వహణ ఎంత పతనావస్థకు దిగజారుతున్నదో మళ్లీ మళ్లీ లీక్ అవుతున్న నీట్ పరీక్షలను ఉదాహరణగా పేర్కొనవచ్చు.
ఇందుకు కోచింగ్ సెంటర్ల యజమాన్యాలనో, దళారులనో నిందించి ప్రయోజనం లేదు. విద్యను వ్యాపార వస్తువుగా మార్చి, స్వేచ్చగా అమ్ముకునే అవకాశం కల్పించిన పాలకు లనే నిందించాలి, తప్పు పట్టాలి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమ చర్యలద్వారా మెప్పించగల నైపుణ్యం, సామర్థ్యం కొందరి అధికారుల్లో ఉంది. దీని వెనుక కొందరు విద్యా వ్యాపారవేత్తల అండదండలు కూడా ఉ
న్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడి విద్యార్థుల నుంచి నిరసనలు ఎదురై నప్పుడు సంబంధిత మంత్రులు రాజీనామా చేసిన సంద ర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఒకసారి ఇంటర్మీడియేట్ప్రశ్నపత్రాలకు సంబంధించి అప్పటి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు రాజీనామా చేయగా పదోతరగతి ప్రశ్నపత్రాలకు సంబంధించి అప్పటి మంత్రి రాంచంద్ర రావును పదవి నుంచి తప్పించారు. కానీ ఈ పరీక్షల నిర్వహణలో కీలకపాత్ర వహిస్తున్న అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండడం లేదు. ప్రస్తుతం లీకక్కు కారణ మైన అధికార, అనధికార అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి. వారి ఫొటోలను పత్రికల్లోనూ, టివీల్లోనూ వాల్పోస్టర్ల ద్వారా ప్రజలకు తెలియచేయాలి. పాలకులు ఇంత కఠినంగా వ్యవహరించ కపోతే డబ్బులతో ర్యాంకులు కొనుక్కోవాలనే ఆశపడేవారికి ప్రశ్నపత్రాలతో వ్యాపారం చేసేవారికి భయభక్తులు ఉండవు. ఈ వ్యాపారం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ నిరాటంకంగా జరిగిపోతూనేఉంటుంది. మరొకపక్క ప్రశ్నపత్రాల వ్యాపారంలో కోట్లాది రూపాయలు ఈ దళారులు దోచుకుంటూనే ఉంటారు.
-దామెర్ల సాయిబాబ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్: పరీక్షా కేంద్రాల మార్పునకు మే 21 వరకు ఛాన్స్!

