ప్రకృతి అందాలు చూడాలంటే ఎపికి వెళ్లాల్సిందేనని నీతిఆయోగ్ సిఫారసు: మంత్రి కందుల దుర్గేష్
AP Tourism: భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వైవిధ్యభరితమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ నీతి ఆయోగ్ విడుదల చేసిన 'దివ్య భారత్ ఏ విండో టు ది సోల్ ఆఫ్ ఇండియా' నివేదికలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది.
కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్ర పర్యాటక రంగం నేడు అద్భుత ప్రగతి ప్రయాణాన్ని సాగిస్తోందని ఈ నివేదిక చాటిచెప్పింది.
Read Also: AP Summer Holidays: ఏపీలో రేపటి నుంచే వేసవి సెలవుల సందడి
Andhra Pradesh is the address for natural beauty
AP Tourism: ప్రపంచ పటంలో ఎపి పర్యాటక వైభవం
నీతి ఆయోగ్ విడుదల చేసిన 13 పేజీల సమగ్ర నివేదిక. 1.20 నిమిషాల నిడివి గల ప్రత్యేక వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యా టక గమ్యస్థానాలను ప్రపంచానికి పరిచయం చేశారు. భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని ఆకాంక్షించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఆశయాలకు ఈ నివేదిక మరింత బలాన్ని చేకూర్చింది. ఆంధ్రప్రదేశ్ను సందర్శించేందుకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అత్యంత అనువైన సమయమని పేర్కొన్న నీతి ఆయోగ్, ఏయే నెలల్లో ఏ ప్రాం తాలను సందర్శించాలో విపులంగా వివరించింది.
కూచిపూడి, విలాసిని నాట్యాల వంటి సంప్ర దాయ కళలకు ఎపి కేంద్రమని, ఇక్కడి ఆత్మీయ ఆతిథ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందని అభివర్ణించింది. రాష్ట్రంలోని ప్రకృతి ప్రాంతాలు, ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు, పురాతన కోటలు, సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలు, విశాల సముద్రతీరం, అద్యాత్మిక ప్రాంతాలు, ప్రఖ్యాతి గాంచిన స్థానిక వంటకాలు, సంప్రదాయ వస్త్రా లు, హస్త కళాకృతులు, బౌద్ధారామాలు, పర్యాటక ఉత్సవాలు, ఘనమైన వారసత్వం తదితర విశేషా లను నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్నది.
నివేదికలో ప్రస్తావించిన ప్రధాన పర్యాటక ప్రాంతాలు:
- ప్రకృతి ఒడిలో: అరకు వ్యాలీ, లంబసింగి, మారేడుమిల్లి, పాపికొండలు, కురుపాం అటవీ ప్రాంతాలు, దట్టమైన నల్లమల్ల అడవులు, హార్సి లీ హిల్స్, కొల్లేరు, పులికాట్ సరస్సు మరియు అందమైన కోనసీమ.
- జలపాతాలు రిజర్వాయర్లు: కొత్తపల్లి, రంపచోడవరం, తలకోన, ఎత్తిపోతల జలపాతాలు, కంభం చెరువు, అనకాపల్లి కోసం తాటిపూడి రిజర్వాయర్లు.
- వన్యప్రాణి సంరక్షణ: కంబాలకొండ, కోరింగ మడ అడవులు, నేలపట్టు మరియు ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రాలు.
- చారిత్రక సాహస యాత్రలు: బొర్రా గుహలు, బెలూం గుహలు, ఉండవల్లి, మొగల్రాజపురం, ఉదయగిరి గుహలు. గండికోట (గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా), కొండపల్లి కోట, చంద్రగిరి, గుత్తి కోటలు.
- తీర ప్రాంత సౌందర్యం: రుషికొండ, సూర్యలంక, కొత్తపట్నం బీచ్లు, ఎర్రమట్టి దిబ్బలు, కాకినాడ హోప్ ఐల్యాండ్, గిన్నీస్ రికార్డులో నిలిచిన 5 శతాబ్దాల నాటి తిమ్మమ్మ మర్రిమాను అని మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

