Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నితిన్ కొత్త సినిమా ప్రారంభం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో క్రేజీ ప్రాజెక్ట్

నితిన్ కొత్త సినిమా ప్రారంభం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో క్రేజీ ప్రాజెక్ట్

వార్త 2 weeks ago

యంగ్ హీరో నితిన్ తన తాజా చిత్రాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై ఈ చిత్రం రూపొందనుంది.

హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను చిత్ర యూనిట్ వైభవంగా మొదలుపెట్టింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Also:RB Choudary : చెన్నెకి RB చౌదరి భౌతికకాయం !

కొత్త దర్శకుడి పరిచయం.. నితిన్ సరసన రితికా నాయక్

ఈ సినిమాతో సోము నర్రి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నితిన్ సరసన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ విలక్షణమైన కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నారు.

 Nithiin New Movie Opening

రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?

ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల రెండో వారం నుంచి ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. వరుస విజయాలతో జోరుమీదున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, ఈ చిత్రంతో నితిన్‌కు ఒక భారీ కమర్షియల్ హిట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు ఇతర నటీనటుల పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. నితిన్ కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha