Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి?

నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి?

వార్త 1 week ago

Alias Rukmini movie: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithiin) తన కొత్త సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. మురళీ కాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'అలియాస్ రుక్మిణీ' అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు.

దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Read Also : Nara Lokesh: 'రణబాలి'.. ట్రైలర్‌పై మంత్రి లోకేశ్ ప్రశంసలు

 Bollywood actress as Rukmini in Nithiin’s new movie?

Alias Rukmini movie: కృష్ణ పాత్రలో నితిన్.. ఆకట్టుకుంటున్న లుక్

ఈ చిత్రంలో హీరో నితిన్ ‘కృష్ణ’ అనే ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో నితిన్ ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిలా, కళ్ళద్దాలతో, భుజానికి బ్యాగు వేసుకుని కనిపిస్తున్నారు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, నితిన్ కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ (Aafiya Syed) ఈ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, రుక్మిణీ పాత్రలో నటిస్తున్న ఆ అసలు విషయం అక్టోబర్ 13న అధికారికంగా వెల్లడి కానుంది.

కత్రినా, కృతిసనన్ పై ట్రోల్స్.. మృణాల్ ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha