Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం

నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం

వార్త 2 months ago

Telangana Irrigation Department: కీలకమైన నీటిపారుదలశాఖ పునర్ వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ప్రత్యేకంగా ఇరిగేషన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిలకు రూపకల్పన చేసినట్టు తెలిసింది.

దీంతో నీటిపారుదలశాఖ మేజర్ (పెద్దతరహా నీటిపారుదల విభాగం), మైనర్ (చిన్నతరహా నీటిపారుదల భాగం) గా మళ్లీ వేరుకానుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే త్వరలో అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Read Also: Telangana: ఇక పుస్తకాల కంటే 'ప్రాక్టికల్స్'కే ప్రాధాన్యం.. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి!

 Major and minor irrigation departments to be separated again.

Telangana Irrigation Department: టెరిటోరియల్ విధానంలో చీఫ్ ఇంజినీర్ల నియామకం

గత బిఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీరించింది. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ భాగాలను తొలగించి 36 టోరియల్ పతిపాదికగా చీఫ్ ఇంజినీర్లను నియమించింది. అదేసమయంలో కీలకమైన ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ (ఒఅండ్ం) విభాగాన్ని ప్రత్యేకం ఆ ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన తెలంగాణ బృందం… చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు ఆదితర నీటి వనరులను పటిష్టంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు, ఈ నీటివనరుల భూములు అన్యాక్రాంతం, కబ్జాకు గురికాకుండా ఉండాలంటే, సత్వర మరమ్మతు పనులను చేపట్టాలంటే చిన్ననీటి వనరుల నిర్వహణ (మైనర్ ఇరిగేషన్) విభాగాన్ని ప్రత్యేకంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

కొత్త ఈఎన్సీ పోస్టుల సృష్టిపై ప్రభుత్వ ఆలోచన

ప్రస్తుతం నీటిపారుదలశాఖలో మొత్తం ఆరు ఈ నేపథ్యంలో సాగునీటిపారుదలశాఖ పరిధిలో ఉన్న మైనర్ ఇరిగేషన్ విభాగాన్ని వేరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సాగునీటి శాఖ అత్యంత కీలకమైంది. అందులో మూడు జనరల్, అడ్మిన్, ఓఅండ్ం. కాగా మిగతా 3 టెరిటోరియల్ స్థాయిలో ఉన్నాయి. ఓఅండం, టెరిటోరియల్ ఈఎన్సీ పోస్టులను రద్దు చేసి, వాటి స్థానంలో కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సివొటి)కి, ఇంటర్ స్టేట్, డ్యామ్ సేఫ్టీ, హైడ్రాలజీ విభాగాలకు కలిపి ఒక ఈఎన్సి, సెక్రటేరియట్లోని అడిషనల్ సెక్రటరీకి పోస్టుకు ఈఎన్సిని, అదేవిధంగా వాలంతరీ డైరెక్టర్ జనరల్ (డిజి) పోస్టును ఈఎన్సిగా అప్గ్రేగ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ పునర్ వ్యవస్థీకరిస్తూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించే అవకాశముందని ఇరిగేషన్వర్గాలు చెబుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తారామతి బారాదరిలో 'మోర్ దేన్ ఫ్రెండ్స్' పార్టీపై ఈగల్ పోలీసుల దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha