Education System : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడింది అనడానికి ప్రభుత్వం ఇటీవల విద్యారంగంలో మార్పులు తీసుకురా వడానికి చేపడుతున్న నిర్ణయాలే నిదర్శనం.
1,441 పాఠశాలలను మూసి వేసి 2026-27 యూడైన్ లెక్కల నుండి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 640 పాఠశాలల్లో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఉండి, ఒక్కవిద్యార్థి కూడా లేకపోవడంతో అందులో పనిచేస్తున్న ఉ పాధ్యాయులను వేరే పాఠశాలలకు డిప్యుటేషన్పై వంపించి వాటిని కూడా త్వరలో మూసివేయాలని నిర్ణయించింది. దీనితో ప్రభుత్వ విద్య పట్ల పాలక వర్గాలకు ఉన్న శ్రద్ద ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠ శాలలు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 2,081 జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతానికి 1,441 స్కూళ్లను మూసివేయడంతో పాటు, మిగిలిన 640పాఠశాలలను మూసివేస్తే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 24వేలలోపే పరిమితం కానుంది. గ్రామాలలో పాఠ శాలలు మూతపడటం వల్ల పేద, దళిత, గిరిజన, వెనుక బడిన వర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదంఉంది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కంటే వాటిని పున రుద్ధరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి.
Education System
Education System : నాణ్యమైన విద్యా బోధన
తెలంగాణ సర్కార్ ఏడాదిన్నర క్రితం తెలంగాణ విద్యా కమీషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ తన అధ్యయనంలో రాష్ట్రం లో విద్యా వెనుకబాటును స్పష్టంగా గుర్తిస్తూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో ప్రస్తు తం విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజల నుంచి వచ్చిన సమా చారాన్ని క్రోడీకరించి విద్యారంగం వెనుకబాటు నుండి బాగు చేయడానికి వలు సిఫార్సులు కూడా చేసింది. కేంద్రంలో ఎన్డీఏ నర్కార్ రూపొందించిన నూతన విద్యా విధానం 2020లోని అశాస్త్రీయ విధానాలను తిరస్కరించాలని, ఉచిత నిర్బంధ విద్య బోధనను 18ఏళ్ల వరకు పెంచాలనే సిఫార్సులు వీటిలో అత్యంత అవసరమైనవి. బడి బయట ఉన్న పిల్లల నుండి అసలు బడి అంటే ఏంటో తెలియని వారి సంఖ్యను కూడా వాస్తవాల రూపంలో వెలుగులో తెచ్చింది. ఈవాస్తవాలే ఇప్పటి ప్రభుత్వానికి కంటగింపుగా మారాయి. 100 మంది విద్యార్థులలో 26 మంది మాత్రమే ప్రభుత్వ బడులలో చేరుతున్నారని నగానికి ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని, ప్రభుత్వ రంగంలో 36 శాతం ఏకోపాధ్యాయ బడులు కాగా, 86శాతం బదులలో అన్ని తరగతుల విద్యార్థులను ఒకేగదిలో కూర్చోబెట్టి విద్యాబోధన జరుపుతున్నారని పేర్కొంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణం గా ఉపాధ్యాయులు లేరని, కనీస సౌకర్యాలు. లేవని కూడా తేల్చింది. నాణ్యమైన విద్యా బోధనలో మన స్థానం 26 అని, మూడవ తరగతి విద్యార్థులకు వారి కింది తరగతి పుస్తకం కూడా చదవలేని వెనుకబాటు తనంఉందని, ఇంకా ఉన్నత విద్యా సంస్థలకు 77శాతం కళాశాలకు న్యాక్ గుర్తిం పులేకపోవడం, యూనివర్సిటీల్లో 80శాతం ఖాళీలతో భ్రష్టు పట్టించిన విషయాన్ని కుండ బద్దలు కొట్టి తెలియజెప్పింది.
సంస్కరణల లక్ష్యం నెరవేరు తుందా అనే అనుమానం
ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన విద్య కోసం సమగ్ర రోడ్ మ్యాప్ రూపొందించాలన్న తెలంగాణ విద్యా కమీషన్ లక్ష్యం విస్తృత ఆశయాన్ని ప్రతిబింబించింది. దీనితో కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి, విద్యా కమిషన్ చాలా శ్రమకోర్చి పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి ప్లస్ టు స్థాయివరకు శ్రేష్టమైన విద్యకోసం తీసుకురావాల్సిన మార్పు లను సూచిస్తూ నివేదిక సమర్పించింది. ఫీజుల నియంత్రణ కు సంబంధించి నివేదిక సమర్పించింది. అయిదేళ్ళ ప్రణా ళికను ఖచ్చితమైన బడ్జెట్ అంచనాలతో నివేదికను రూపొం దించింది. కానీ ప్రభుత్వం ఆ నివేదికతో సంబంధం లేకుం డానే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించింది. విద్యాకమీషన్ ఇంకా ఉన్నత విద్య, ఒకేషనల్, టెక్నికల్ విద్యకు సంబం ధించిన అంశాలపై చర్చలు, నివేదికలు పూర్తి చేయలేదు. అన్ని విషయాలతో సమగ్ర నివేదిక కూడా తయారుకాలేదు. ఈలోపే ప్రభుత్వం గత నెలలో తెలంగాణ విద్యా విధానం (టిఈపి) రూపొందించడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను రూ పొందించారు. ఈప్రక్రియను అంతా పరిశీలిస్తే విద్యా కమిషన్లో నిర్మాణ సంబంధలోపాలు, విద్యావిధాన రూప కల్పన ప్రక్రియకు సంబంధించిన లోపాలు స్పష్టంగా కనబ డుతున్నాయి. దీంతో ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరు తుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక అమలుపై స్పష్టత ఇవ్వలేదు.
Education System
పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు
ఇకపోతే తెలంగాణలో పాఠశాల విద్య అంటే ప్రైవేట్ విద్య మాత్రమే అనే భావన నెలకొని ఉంది. అందులోనూ ముఖ్యంగా తల్లి దండ్రులకు టకు నగుర్తొచ్చేదినర్సరీ, ఎల్.కె.జి, యుకెజి బోధన, ఇంగ్లీష్ మీడియం బోధన చేసే ప్రైవేట్ పాఠశాలలే. ఈ రకమైన ప్రైవేట్ బోధన మాత్రమే నిజమైన, నాణ్యమైన చదువుగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భం లో మురళి కమీషన్ ప్రభుత్వ రంగంలో కూడా నర్సరీ, ఎల్.కె.జి. యుకెజిలను బోధించే వూర్వ ప్రాథమిక విద్య ను తీసుకురావాలని, నర్సరీ నుండి పి.జి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్య బోధన జరపాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలు కలిగినట్టి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో విస్తరించిప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాలని, ప్రతి తర గతికి ఒక గది నిర్మాణం చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌళిక సదుపాయాల కల్పన, నిత్యం మాని టరింగ్ కోసం జిల్లాస్థాయి పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుచేయాలనడం పేద, మధ్య తరగతి విద్యార్థులకు చాలా ఉపయో గకరమే. పాఠశాల విద్యలో మరోసిఫార్సు ఆయా సొసైటీ లుగా కొనసాగుతున్న గురుకుల విద్య సంస్థలను ఒకటిగా కలపడం. కుల వ్యవస్థను సుస్థిరం చేస్తున్న ఆయా కులాల గురుకులాలను కలిపి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ పౌరసమాజం నుంచి వచ్చినదే. ఇక ఇంటర్మీడియట్ విద్యలో చేసిన సి ఫార్సులను వరిశీలిస్తే మెజారిటీ సిఫార్సులు ప్రైవేట్ కళాశాలల, కోచింగ్ సెంటర్ల దోపిడీని అరికట్టడానికి వచ్చినవే. ప్రైవేట్ పాఠశాలల జూని యర్ కళాశాలలో ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించా లని సిఫార్సు చేయడం ఆహ్వానించదగినదే. ప్రైవేట్ పాఠశా లలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతంచేయాలి. బడుల్లో మెరుగైనమౌలిక నదుపాయాలు కల్పించాలి. పాఠశాలలను మూసివేయడం సమస్యకు ముగింపు కాదు.వాటికి పూర్వ వైభవం తీసుకురా వడమే ఈ సమస్యకు పరిష్కారం. విద్యా సంస్కరణలనేవి ఆడంబరం కాకుండా నూతన మార్పుకు నాంది కావాలి.
-నాదెండ్ల శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

