Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
న్యూయార్క్‌లో కలకలం.. టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి!

న్యూయార్క్‌లో కలకలం.. టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి!

వార్త 2 weeks ago

Times Square Attack: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఎప్పుడూ టూరిస్టులతో రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్ (Times Square) వద్ద తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.

ఒక మహిళ ఇద్దరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దారుణ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా, తీవ్ర గాయాలపాలైన ఒక మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మన్‌హట్టన్‌లోని వెస్ట్ 42వ స్ట్రీట్, సెవెంత్ అవెన్యూ కూడలి వద్ద సోమవారం సాయంత్రం ఈ దాడి జరిగింది.

Read Also :Russia War : రష్యా యుద్ధంలో 51 మంది ఇండియన్స్ మృతి - కేంద్రం

Times Square Attack: ఘటన వివరాలు & పోలీసుల స్పందన

దాడికి పాల్పడిన మహిళ తీవ్ర మానసిక ఆందోళనతో (Mental Distress) ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తన వద్ద ఉన్న షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు పెద్ద కిచెన్ కత్తులను తీసి ఒక్కసారిగా పక్కనున్న వారిపై దాడికి దిగింది. ఈ ఘటనలో 68 ఏళ్ల వ్యక్తితో పాటు 32 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కడుపులో కత్తితో పొడవడంతో ఇద్దరినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స ఫలించక సదరు మహిళ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. టైమ్స్ స్క్వేర్ సబ్‌స్టేషన్ సమీపంలో కత్తులతో తిరుగుతున్న ఆ మహిళను అదుపు చేసేందుకు పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపి కస్టడీలోకి తీసుకున్నారు.

పెంటగాన్‌లో అలజడి: యూఎస్ ఆర్మీ సెక్రటరీ డ్యాన్ డ్రిస్కోల్ రాజీనామా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha