Dailyhunt
Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు

Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు

వార్త 2 months ago

డిశా (Odisha) రాష్ట్రంలో చోటుచేసుకున్న ఒక భయానక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఐదు రూపాయల విలువైన స్నాక్స్ ప్యాకెట్‌లో ఉచితంగా ఇచ్చిన చిన్న బొమ్మ బాలుడి జీవితాన్నే అంధకారంలోకి నెట్టింది.

ఆ బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడు, కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఈ విషాద ఘటన బలాంగీర్ జిల్లాలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే… బాధితుడైన బాలుడు స్థానిక దుకాణంలో 'లైట్ హౌస్' అనే బ్రాండ్‌కు చెందిన కార్న్ పఫ్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు.

Read also:Karur stampede: నటుడు విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు

పోలీసులకు ఫిర్యాదు

స్నాక్స్ తిన్న తర్వాత, అందులో వచ్చిన చిన్న బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే ఆ బొమ్మ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ప్రభావంతో బాలుడి కంటి గుడ్డు పగిలిపోయింది.కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి, ఆ కంటికి చూపు తిరిగి రాదని నిర్ధారించారు.

ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత స్నాక్ తయారీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ ఉత్పత్తిని మార్కెట్ నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. తమ కుమారుడికి తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు.ఇలాంటి ఉత్పత్తుల భద్రతపై కఠినమైన నియంత్రణలు, తనిఖీలు అవసరమని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Gadwal: భార్య రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం.. (ఇదిగో వీడియో)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha