Tirumala Pavithrotsavam 2026: కలియుగ వైకుంఠమైన తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త ఆధ్యాత్మిక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు ఆలయంలో అత్యంత వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఒకే టికెట్‌పై వరుసగా మూడు రోజుల పాటు నాలుగు సార్లు శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకునే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పవిత్రోత్సవాల ప్రత్యేక సేవా టికెట్లను ఈనెల మే 21వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
Read Also:Srisailam: భక్తుల రద్దీతో కిక్కిరిసిన శ్రీశైలం

Tirumala Pavithrotsavam 2026: ఈ ప్రత్యేక టికెట్ ధరను రూ. 5,000 గా నిర్ణయించారు. ఈ ఒక్క టికెట్‌పై దంపతులు లేదా ఇద్దరు భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. టికెట్ పొందిన భక్తులకు కేవలం దర్శనమే కాకుండా, ఉత్సవాల రోజుల్లో ఉదయం వేళల్లో జరిగే కన్నులపండువైన ‘స్నపన తిరుమంజనం’ (అభిషేకం) సేవలో మరియు చివరి రోజు నిర్వహించే ‘పూర్ణాహుతి’ క్రతువులో నేరుగా పాల్గొనే అరుదైన భాగ్యం లభిస్తుంది. ఈ సేవలకు హాజరయ్యే భక్తులు ఉదయం 7 గంటలకల్లా సాంప్రదాయ దుస్తులలో, ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డుతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 కు చేరుకోవాలని టీటీడీ సూచించింది. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ తెలియక జరిగే దోషాల నివారణార్థం నిర్వహించే ఈ పవిత్రోత్సవ టికెట్లను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అధికారులు కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

